
Constipation problem : మలబద్ధకం సమస్య ఈ రోజుల్లో ఎక్కువవుతోంది. మనం తిన్న ఆహారాలు జీర్ణం కాకపోతే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఇది తీవ్రంగా మారితే ఫైల్స్ గా మారుతుంది. దీంతో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఆహార పదార్థాలను తినడం మానేస్తే మలబద్ధకం సమస్య రాదు. అవేంటో తెలుసుకుని వాటినే తినేందుకు ఇష్టపడాలి. అప్పుడే మనకు మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది.
అరటి పండ్లు తక్కువగా తింటే మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు. కానీ అవే ఎక్కువగా తింటే అదే మలబద్ధకానికి కారణం కావచ్చు. అందుకే అరటిపండ్లు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉదయం పూట అరటిపండ్లు అసలు తినకూడదు. ఏదైనా ఆహారం తిన్నాకే అరటిపండ్లు తినడం మంచిది. లేకపోతే ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు.
తెల్ల అన్నం కూడా మలబద్ధకం సమస్యకు కారణమవుతుంది. ఇందులో పొట్టు, ఊక, సూక్ష్మక్రిములు తొలగిపోవడంతో అన్నం తిన్న వ్యర్థమే. దీంతో మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. వీటికి బదులు ఒక కప్పు బ్రౌన్ రైస్ తినడం ఎంతో మేలు. ఇందులో 3.5 గ్రాముల ఫైబర్, 5 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అందుకే తెల్ల అన్నం తింటే మలబద్ధకం సమస్య వస్తుంది.
బ్రెడ్ కూడా మలబద్ధకాన్ని ప్రేరేపిస్తుంది. రీఫైన్ పిండిలో ఫైబర్ ఉండదు. అందుకే త్వరగా జీర్ణం కాదు. దీంతోనే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. చాక్లెట్లకు కూడా దూరంగా ఉండాలి. దీంతో కూడా జీర్ణక్రియ దెబ్బతింటుంది. కండరాల సంకోచాలు మందగిస్తాయి. ఫలితంగా మలబద్ధకం వేధిస్తుంది. ఇలాంటి ఆహారాలను దూరం చేసుకుని మలబద్ధకం లేకుండా జాగ్రత్త పడాలి.