గ్రౌండ్ రిపోర్ట్: జడ్చర్ల బీజేపీలో సమర్థుడైన నాయకుడు లేడా?
గ్రౌండ్ రిపోర్ట్ : టికెట్ ఎవరికి వస్తుందో ?
గ్రౌండ్ రిపోర్ట్ : పార్టీ విజయానికి నేతలు తోడ్పడతారా?
————————-
బీఆర్ఎస్ అభ్యర్థి : మంత్రి లక్ష్మారెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థి : మల్లు రవి
బీజేపీ అభ్యర్థి : మధుసూదన్
—————————
Constituency Review Jadcherla :మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గంలో బీజేపీకి అభ్యర్థులే కనిపించడం లేదు. దీంతో నియోజకవర్గంలో పోటీలో నిలిచే వారెవరో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో జడ్చర్లలో బీజేపీకి ధీటైన అభ్యర్థి కనిపించడం లేదు. రాష్ట్రంలో బీజేపీ సత్తా చూపుతుంటే ఇక్కడ మాత్రం అభ్యర్థి సరైన వారు లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో జడ్చర్లలో ఏమేరకు బీజేపీ విజయం సాధిస్తుందో అంచనా వేయడం కష్టమే అని చెబుతున్నారు.
గత కొద్ది కాలంగా నాయకత్వ సమస్యతో బీజేపీ బాధపడుతోంది. సెకండ్ కేడర్ బలంగా ఉన్న ఇక్కడ నాయకత్వ సమస్య వెంటాడుతోంది. దీనిపై రాష్ట్ర నాయకత్వం సైతం పట్టించుకోవడం లేదు. దీంతో సమర్థుడైన నాయకుడు ఇక్కడ కనిపించడం లేదు. దీంతోనే విజయం దక్కడం లేదు. ఇక్కడ ఈసారి కచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశంలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.
గతంలో ఇక్కడ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న బాల త్రిపుర సుందరి తరువాత కాలంలో కనిపించడం లేదు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో చురుకుగా పాల్గొన్న ఆమె ఇప్పుడు మౌనంగా మారిపోయింది. దీంతో ఇక్కడ నుంచి ఆమె పోటీకి తయారుగా లేనట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా నాయకుడు మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది.
బీసీ ఓటర్లు అధికంగా ఉండటంతో మదుసూదన్ యాదవ్ ప్రయత్నాలు ముమ్మర చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఓ గది అద్దెకు తీసుకుని ఓటర్లను కలుస్తున్నట్లు సమాచారం. డీకే అరుణ, జితేందర్ రెడ్డి వంటి నేతలు ఉన్న మహబూబ్ నగర్ లో జడ్చర్లకు సరైన నాయకుడు లేకపోవడం విడ్డూరమే. వారు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నా స్థానిక నాయకత్వాన్ని మాత్రం సెట్ చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
గత మున్సిపల్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ తో సమానంగా కౌన్సిలర్ స్థానాలు దక్కించుకున్న బీజేపీ తరువాత కాలంలో చతికిలపడింది. దీంతో నాయకత్వం ఇతర పార్టీల్లోకి జంప్ చేసింది. కానీ ఇప్పుడు అలా జరగకుండా చేయడం నాయకుల చేతుల్లోనే ఉంది. స్థానిక నాయకత్వాన్ని విడిపోకుండా చేసి విజయం సాధించేందుకు కావాల్సిన పరిస్థితులను కల్పించుకోవడం ముఖ్యం.
వచ్చే ఎన్నికల్లో జడ్చర్లలో కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అధికార పార్టీ బీఆర్ఎస్ మీద ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లతో అందరికి లబ్ధి జరిగింది. కానీ బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క పేదవాడికి కూడా న్యాయం జరగలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తామని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ గెలుస్తుందని అందరు అనుకుంటున్నారు.