22.2 C
India
Tuesday, January 20, 2026
More

    Kovuru Constituency Review : నియోజకవర్గ రివ్యూ: కోవూరులో గెలుపెవరిది..?

    Date:

    Kovuru Constituency Review
    Kovuru Constituency Review

    టీడీపీ: పొలంరెడ్డి దినేశ్ రెడ్డి
    వైసీపీ: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి( ప్రస్తుత ఎమ్మెల్యే)

    Kovuru Constituency Review : సాగరతీరం.. కోనసీమలా కనిపించే ప్రాంతం కోవూరు..పూర్తి డెల్టా ప్రాంతం ఇది. విభిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం. సముద్రతీరం ఎక్కువగా ఉంటుంది. పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ప్రాంతం.. నల్లపురెడ్ల కంచుకోట.. ఈసారి ఇక్కడ పోరు ద్విముఖంగానే కనిపిస్తున్నది.  గతంలో కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండగా, ఆ తర్వాత ఇక్కడ టీడీపీ ప్రభావం పెరిగింది. నల్లపురెడ్డి కుటుంబం కోవూరులో ప్రభావం చూపుతూ వస్తున్నది. అయితే టీడీపీలోనే ఉన్న ఈ కుటుంబం 2012లో వైసీపీ పక్కన చేరింది.  ఆ తర్వాత 2019 ఎన్నికల్లో విజయం ఆ పార్టీ ఖాతాలో పడింది.

    అయితే ఇక్కడ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇక్కడ 2014 ఎన్నికల్లో గెలిచారు. 2019 ఎన్నికల్లో మరోసారి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచారు. అయితే ఇక్కడ ఈ ఇద్దరి మధ్య పోటీ కొనసాగుతున్నది. అయితే ఈసారి 2024 ఎన్నికల్లో పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొడుకు దినేశ్ రెడ్డి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతున్నది. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అవినీతి పెరిగిందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తున్నదని టీడీపీ భావిస్తున్నది. మరోవైపు ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అంటున్నారు. ఇక్కడ ఇసుక అక్రమ రవాణా పెరిగిందని, దీని వెనుక నల్లపురెడ్డి కుటుంబం ఉందని టీడీపీ ఆరోపిస్తున్నది.

    నియోజకవర్గంలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమస్య అలాగే ఉండిపోయింది. దశాబ్దాలుగా ఈ ఫ్యాక్టరీ తెరవాలని ప్రజలు కోరుతూనే వస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఈ ఫ్యాక్టరీ మాత్రం తెరుచుకోవడం లేదు. ఎన్నికల సమయంలో మాత్రం అన్ని పార్టీలు దీనిని హామీగా ఉపయోగించుకుంటున్నాయి. 2024 ఎన్నికల్లో కూడా ఇది హామీగా మారబోతున్నది. ఎస్టీ సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది.

    ఎమ్మెల్యే అక్రమాలు, తమ పొత్తులు ఇక్కడ గెలిపిస్తాయని టీడీపీ, జనసేన భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే ఎన్నో సమస్యలు నియోజకవర్గంలో రాజ్యమేలుతున్నాయి. సంక్షేమ పథకాలు అందుతున్నా, మౌలిక వసతుల కల్పన మాత్రం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రోడ్లు, తాగునీటి సౌకర్యం లాంటి ఇబ్బందులు ఉన్నాయి. అయితే నల్లపురెడ్డి కుటుంబానికి ఇక్కడ కొంత వ్యతిరేకత పెరుగుతున్నా, మరి ఇతర పార్టీల వైపు చూసేంత బలంగా అవి కనిపించడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వైసీపీ, ఎమ్మెల్యే అవినీతిపై బలంగా వ్యతిరేకత టీడీపీకి అస్ర్తాలుగా మారబోతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఓ టీడీపీ కార్యకర్త ఆవేదన.. వైరల్

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు వ్యవహరించిన...

    రా.7గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్

    వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ...

    TDP Coalition: కూట‌మి పాల‌న‌పై పాజిటివ్ చ‌ర్చ లేదేం!

    TDP Coalition: టీడీపీ స‌ర్కార్ కొలువుదీరి ఐదు నెల‌లు కావస్తుంది. ఇప్పటికే...