బీఆర్ఎస్ అభ్యర్థి: గూడెం మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థి: స్పష్టత లేదు
బీజేపీ అభ్యర్థి: స్పష్టత లేదు
—————-
గ్రౌండ్ రిపోర్ట్: పటాన్ చెరులో గెలిచేదెవరు?
గ్రౌండ్ రిపోర్ట్ : అన్ని పార్టీల్లో వర్గ పోరు ప్రధానం
గ్రౌండ్ రిపోర్ట్ : పార్టీల నిర్ణయం ఎలా ఉంటుందో?
———————–
Patan Cheru Constituency Review: మెదక్ ఉమ్మడి జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో పటాన్ చెరు ఒకటి. వైవిధ్యమైన ప్రాంతంగా దీనికి పేరుంది. ఇండియాలోని అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించే ప్రాంతంగా ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచి ప్రతిపక్షాలకు సవాలు విసురుతోంది. ఈనేపథ్యంలో పటాన్ చెరు నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ గెలిచేదెవరు? పోటీలో నిలిచేదెవరు? అనే టాక్ వస్తోంది. రాజకీయ చదరంగంలో బరిలో నిలిచి ఎవరు గెలుస్తారనే చర్చ మొదలైంది.
ఇక్క ఉన్న మూడు పార్టీల్లో వర్గ పోరు కొనసాగుతోంది. అధికార పార్టీ బీఆర్ఎస్ లో సైతం వర్గపోరు నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి ఉండగా నీలం మధు అనే నాయకుడు సైతం టికెట్ కోసం పోటీలో ఉన్నాడు. ఈసారి టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మంత్రి కేటీఆర్ తన దగ్గర అని టికెట్ ఎలాగైనా తెచ్చుకుంటానని చెబుతున్నాడు.
ఇక కాంగ్రెస్ లో కూడా ఇద్దరు పోటీపడుతున్నారు.మెదక్ పార్లమెంట్ ఇన్ చార్జిగా గాలి అనిల్ కుమార్, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గ పోరు నడుస్తోంది. టికెట్ తనకంటే తనకే వస్తుందని పోటీ ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియడం లేదు.
బీజేపీ నుంచి నందీశ్వర్, గోదావరి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీల్లో ఉన్న వర్గపోరుతో పార్టీలకు తలనొప్పిగా మారింది. టికెట్ల వ్యవహారంతో అసమ్మతి వర్గం ఏర్పడే అవకాశాలున్నాయని అందరు భయపడుతున్నారు. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు రెబల్ గా మారే సూచనలున్నాయి. ఈనేపథ్యంలో పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటాయోననే ఆసక్తి ఓటర్లలో కనిపిస్తోంది.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి మంచి మాస్ ఇమేజ్ ఉంది. కార్మిక నాయకుడిగా పేరుంది. ఆయన పోటీని తట్టుకోవడం కష్టమే అంటున్నారు. టికెట్ తనకే వస్తుందని మహిపాల్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అధిష్టానం మదిలో తనకే స్థానం ఉంటుందని చెబుతున్నారు. పటాన్ చెరులో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని అంటున్నారు.
పటాన్ చెరులో డెవలప్ మెంట్ జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఎమ్మెల్యే మాత్రం పనులు పరుగులు పెట్టించానని చెబుతున్నారు. దీంతో ఓటర్ల మదిలో ఏముందో తెలియడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో? ఎవరిని ఇంటికి పంపుతారో అనే చర్చ జోరుగా సాగుతోంది.