వైసీపీ: పెండెం దొరబాబు(ప్రస్తుత ఎమ్మెల్యే)
టీడీపీ: ఎస్వీఎస్ఎన్ వర్మ
జనసేన: పిళ్ల శ్రీధర్
ఓటర్లు:2.30లక్షలు
Pithapuram Constituency Review ఏపీలోని గోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. మొత్తంగా 2.30 లక్షల మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. గత రెండు సార్లు ఇక్కడ వైసీపీ గెలిచింది. అయితే పిఠాపురంలో గెలిచిన పార్టీ రాష్ర్టంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ గతంలో ఉండేది. కానీ 2019లో వైసీపీ ఈ సీటును గెలుచుకొని రాష్ర్టంలో అధికారంలోకి కూడా వచ్చింది. గత సెంటిమెంట్ ను తుడిచి పెట్టింది.
ఇక 2024లో పిఠాపురంలో పోటీ రసవత్తరంగా ఉండబోతున్నదనే ప్రచారం జరుగుతున్నది. అయితే ఈసారి పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. పిఠాపురంలో పవన్ గనుక బరిలోకి దిగితే ఇక రాష్ర్టంలో కీలక నియోజకవర్గం కానుంది. అందరి చూపు ఆ నియోజకవర్గం వైపు మళ్లే చాన్స్ ఉంది. అయితే ఇప్పటికే టీడీపీ, వైసీపీల నుంచి బలమైన అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పక్కా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు ఎంవీఎస్ఎన్ వర్మ. మరోవైపు ప్రభుత్వం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ద్వారా మరోసారి ఫ్యాన్ గాలి వీయడం ఖాయమని పెండెం దొరబాబు ధీమాతో ఉన్నారు. సంక్షేమ పథకాలు, సామాజిక వర్గం వైసీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అవకాశంఉంది.
ఇక పార్టీల పొత్తుల అంశంలో జనసేన కూడా ఈ సీన్ లోకి వచ్చింది. జనసేన నేత పిల్లా శ్రీధర్ కూడా ఈ పోటీ చేయాలని భావిస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడితే తాము కలిసి గెలిపించుకుంటామని చెబుతున్నారు. మరోవైపు జనసేన కూడా ఇక్కడ పోటీకి జనసేన సిద్ధమవుతున్నది. మరోవైపు పొత్తుల అంశం నేపథ్యంలో ఇక్కడ నుంచి జనసేన, టీడీపీలో ఏదో ఒక అభ్యర్ధి మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. అయితే పవన్ బరిలోకి దిగాలనుకుంటే టీడీపీ ఈ సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉంటుంది. కాపుల ఓటు బ్యాంక్ బలంగా ఉన్న నియోజకవర్గం కావడంతో పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. ఇక నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే మరోసారి గెలిపిస్తుందని ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దోరబాబు చెబుతున్నారు. ఏదేమైనా ఈ సారి పోరు రసవత్తరంగా ఉండబోతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మూడు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తూ, విజయం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.