గ్రౌండ్ రిపోర్ట్: త్రిముఖ పోరు
అసెంబ్లీ నియోజకవర్గం: ఖైరతాబాద్
బీఆర్ఎస్: దానం నాగేందర్
కాంగ్రెస్: రోహిణ్ రెడ్డి, విజయారెడ్డి (పీజేఆర్ కూతురు)
బీజేపీ: చింతల రాంచంద్రారెడ్డి
Khairatabad Constituency Review
హైదరాబాద్ కే తలమానికంగా ఉన్న ఈ నియోజవకవర్గం 2009 డీ లిమిటేషన్ లో భాగంగా ముక్కలైంది. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ గా ఏర్పడింది. ప్రస్తుతం ఖైరతాబాద్ సెగ్మెంట్ పరిధిలో 279497 ఓటర్లు ఉన్నారు. ఇందులో బీసీ, ఎస్సీ ఓట్లే కీలకం కానున్నాయి. ఇక ప్రస్తత రాజకీయం గురించి చెప్పుకునే ముందు గతంలో రాజకీయం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఖైరతాబాద్ లో పీ జనార్దన్ రెడ్డి వన్ అండ్ ఓన్లీగా ఉండేవారు. 1978 నుంచి మొదలు పెడితే 1985, 1989, 1994 వరకు వరుసగా గెలుపొందారు. 1999లో ఓటమి పాలైనా 2004లో మళ్లీ తన నియోజకవర్గాన్ని తానే దక్కించుకున్నారు. మంత్రి వర్గంలో, సీఎల్పీ లీడర్ గా పని చేశారు.
పీజేఆర్ అంటే ఆ నియోజవర్గానికి దేవుడి లెక్క. ఆయన జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత. ఇప్పటికీ అక్కడి షాపులు, చిన్న చిన్న కొట్లలో పీజేఆర్ ఫొటో కనిపిస్తుందంటే ఆశ్చర్యం లేదు. ఆయనకు ఉన్న ఈ పలుకుబడే ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మార్చింది. అలాంటి ఇలాఖాలో గత ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎంటరైంది. కానీ ఈ సారి మాత్రం సీన్ మారుతుందని వాదనాలు వినిపిస్తున్నాయి.
ఈ నియోజవకర్గంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లాంటి క్లాస్ ఏరియాలతో పాటు సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట లాంటి మిడిల్ క్లాస్ ఏరియాలు కూడా ఉంటాయ్. ఇంకా, సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవనన్, రవీంద్రభారతి లాంటివి ఈ సెగ్మెంట్‌లోనే ఉన్నాయ్. అందుకే ఖైరతాబాద్ హైదరాబాద్ కు గుండెకాయ అంటారు. భౌగోళికంగా పరిశీలిస్తే నారాయణగూడ నుంచి మొదలుపెడితే.. హైదర్‌గూడ, హిమాయత్ నగర్, లక్డీకపూల్, సోమాజిగూడ, పంజాగుట్ట, రాజ్‌భవన్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కింగ్ కోఠి, బషీర్‌భాగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నియోజకవర్గం విస్తరించి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మహా నగరం మ్యాప్ నడిబొడ్డున ఉంటుంది ఖైరతాబాద్.
సిట్టింగ్ పార్టీ బీఆర్ఎస్
ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. 1999లో టీడీపీ, 2014లో బీజేపీ ప్రస్తుతం బీఆర్ఎస్ మినహా నియోజవకర్గం ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీనే గెలుస్తూ వస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడే. 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరి 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మె్ల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయనకు నియోజవకవర్గంలో ఎదురుగాలి వీస్తోంది. ఆయన హయాంలో చెప్పుకునేంత అభివృద్ది జరగలేదని అక్కడి వారి వాదన. ఆయనకు పోటీడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సారి తనకే టికెట్ అంటూ శ్రవణ్ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ సిట్టింగులకే టికెట్ అన్న కేసీఆర్ హామీతో దానం ధీమాగానే ఉన్నారు. శ్రవణ్ కు తోడు మన్నె గోవర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపునకే చూస్తున్నారు. దీంతో.. బీఆర్ఎస్‌లో టికెట్ పోరు పెరుగుతోంది.
హస్తం కకావికలం
ఖైరతాబాద్ కు కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ కు ప్రస్తుతం కలిసి రావడంలేదు. అప్పుడు పీజేఆర్ ఐదు సార్లు గెలిచి నియోజకవర్గానికే ఆరాధ్యుడిగా మారాడు. ఆయనంత కాకపోయినా దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ లీడర్ గా రాణించాడు. కానీ ఆయన కూడా బీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ పిరిస్థితి మరింత కష్టంగా మారింది. పీజేఆర్ వారసురాలిగా ఆయన కూతురు విజయారెడ్డి వస్తుందనుకున్న సమయానికి ఆమె కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లోకి వెళ్లింది. కానీ దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ లోకి రావడంతో తిరిగి విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఇదే ప్రాంతం నుంచి టికెట్ కోసం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకుంటున్న రోహిణ్ రెడ్డి ఆశిస్తున్నారు. విజయారెడ్డి, రోహిణ్ రెడ్డి ఇద్దరూ రేవంత్ వర్గమే కావడంతో ఈ సారి టికెట్ ఎవరిని వరిస్తుందా అన్న చర్చ జరుగుతోంది.
బీజేపీకి తప్పని వర్గపోరు
ఇక బీజేపీ విషయానికి వస్తే ఈ పార్టీ మెల్లమెల్లగా నియోజకవర్గంలో వేళ్లూనుకుంటుంది. టీడీపీతో పొత్తులో భాగంగా 2014లో చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకుంది ఈ పార్టీ. హిందూ పండుగలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తారు రామచంద్రారెడ్డి. కానీ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కమలం కనిపించలేదు. కేవలం.. హిమాయత్ నగర్, ఫిలింనగర్ లో ఇద్దరు కార్పొరేటర్లు గెలిచారు. అయితే మరోసారి.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చింతల రెడీ అవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై నియోజవకర్గం అసంతృప్తితో ఉందని గతంలో రెండో ప్లేస్ లో ఉన్నతాను ఈసారి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన సన్నిహితుల చెప్పుకుంటున్నారు. అయినా చింతలకు వర్గపోరు తప్పడం లేదు. ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఒకే ఒక కార్పొరేటర్ చింతలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. బండి సంజయ్ సన్నిహితుడు ఎన్వీ సుభాష్ కూడా ఇదే టికెట్ కావాలని కోరుతున్నారు. మరో నేత పల్లపు గోవర్ధన్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీళ్లందరిలో.. ఎవరికి టికెట్ ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
రసవత్తర పోరు
ఇక మొత్తంగా పరిశీలిస్తే 2023 ఎన్నికలు ఖైరతాబాద్ లో రసవత్తర పోరుకుదారి తీస్తున్నాయి. ఇక్కడ.. ప్రధానంగా ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తుంది. నియోజకవర్గం నుంచి వస్తున్న టాక్ ఏంటంటే.. చదువుకున్న వారు, పస్ట్ టైం ఓటర్లు, యంగ్ జనరేషన్ పై బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. బస్తీల్లో ఇప్పటికీ పీజేఆర్‌ను అభిమానించే ఓటర్ల సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ వర్గం అంతా బీఆర్ఎస్ వైపునకు వెళ్లిందన్న టాక్ ఉంది. అందువల్ల ట్రయాంగిల్ ఫైట్ తప్పదని తెలుస్తోంది.