గ్రౌండ్ రిపోర్ట్: గద్వాలలో గెలుపెవరిది?
గ్రౌండ్ రిపోర్ట్ : గద్వాలలో త్రిముఖ పోరు
—————–
బీఆర్ఎస్ అభ్యర్థి క్రిష్ణమోహన్ రెడ్డి
బీజేపీ అభ్యర్థి డీకే అరుణ
కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థిపై స్పష్టత లేదు
Gadwal Constituency Review: మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల నియోజకవర్గం ప్రత్యేకతే వేరు. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో ఉంది. దీంతో వాల్మీకులు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో వారంతా అధికార పార్టీకి ఓటు వేసి ఆ అభ్యర్థి క్రష్ణమోహన్ రెడ్డిని గెలిపించారు. కానీ ప్రభుత్వం ఆ హామీని పట్టించుకోకపోవడంతో వారిలో ఆగ్రహం వస్తోంది. దీంతో వారిని బీజేపీకి అనుకూలంగా మలుచుకోవాలని డీకే అరుణ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక అధికార పార్టీలో ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. జెడ్పీ చైర్ పర్సన్ సరిత, సిట్టింగ్ ఎమ్మెల్యే బండ క్రిష్ణమోహన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దీంతో టికెట్ ఎవరికి ఇస్తారో తెలియడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇదివరకు వీరి మధ్య ప్రొటొకాల్ వ్యవహారం పలు మార్లు వివాదాలకు దారి తీసింది. దీంతో ఇప్పుడు టికెట్ ఎవరికి వస్తుందో తెలియడం లేదు. అధిష్టానం చూపు ఎవరి వైపు ఉందో అంతుచిక్కడం లేదు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువయ్యారు. ఇన్నాళ్లు డీకే అరుణ ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించింది. ఆమె ఇప్పుడు బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కనిపించడం లేదు. ఇది వరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గొంగళ్ల రంజిత్ కుమార్ ఈ సారి కూడా బరిలో ఉండే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అతడిని తమ అభ్యర్థిగా నిలబెడితే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తోంది.
అధికార పార్టీ బీఆర్ఎస్ కు మాత్రం ఇక్కడ టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై క్లారిటీ రావడం లేదు. జెడ్పీ చైర్ పర్సన్ సరిత ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆమెకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమనే సర్వేలు చెబుతున్నాయట. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే క్రిష్ణమోహన్ రెడ్డి భవితవ్యం గందరగోళంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీలో త్రిముఖ పోరు నెలకొంటుంది.
ఈ నేపథ్యంలో గద్వాలలో గెలిచేవారెవరు? పోటీలో నిలిచేవారెవరు? అనే ఆలోచనలు సగటు ఓటరులో వస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులుగా ఎవరిని నియమిస్తాయి? గెలుపు గుర్రాల వేటలో పార్టీలు తలమునకలవుతున్నాయి. ఈ క్రమంలో గద్వాలలో గెలిచే వారి కోసం పార్టీలు అన్వేషిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ సమర్థులైన వారి వేటలోనే ఉన్నాయని తెలుస్తోంది.