
సినిమాను తెరకెక్కించడం ఒక వంతు అయితే.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం మరో వంతు. అందుకే సినిమా ప్రమోషన్లను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తుంటారు కొందరు. అప్పుడప్పుడు ఇలాంటివే కాంట్రవర్సీలకు దారి తీస్తుంటాయి. తాజాగా యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న రంగబలి సినిమా ప్రమోషన్ కోసం ఇలాగే చేశాడు.
కమెడియన్ సత్యతో నాగశౌర్య ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఇందులో సత్య కొందరు మీడియా ప్రతినిధుల గెటప్ లు వేసుకుని ఇంటర్వ్యూ చేశాడు. ఓపెన్ హార్ట్ విత్ సత్య, ఇట్లు డ్రాఫర్, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ దేవీప్రియ’, ప్రెస్ మీట్ విత్ నరేష్ మండేటి, ‘ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ వల్లి’.. ఇలా ఐదుగురి గెటప్ లు వేసుకున్నాడు.
ఈ ఐదుగురు ఎవరోకాదు.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, జాఫర్, దేవి నాగవళ్లి, నాగరాజు, గ్రేట్ ఆంధ్ర సీనియర్ జర్నలిస్ట్ మూర్తిలను ఇమిటేట్ చేశాడు. ఈ ఇంటర్వ్యూ ప్రోమో ఓ రేంజ్ లో వైరల్ అయింది. దీనిపై రక రకాల మీమ్స్, ట్రోల్స్ కూడా జరిగాయి. దాంతో ఈ ఇంటర్వ్యూ చూసిన సదరు జర్నలిస్టులు హర్ట్ అయ్యారంట.
వారు మూవీ యూనిట్ కు ఫోన్ చేసి సీరియల్ అయినట్టు తెలుస్తోంది. కొందరు ఇలా తమను ఇమిటేట్ చేయడాన్ని అస్సలు తట్టుకోవట్లేదంట. దాంతో ఈ ఇంటర్వ్యూ ఫుల్ వీడియోను రిలీజ్ చేయట్లేదంట. ఇప్పుడు ఈ విషయమే ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు మొదట్లోనే అడ్డంకులు తగులుతున్నాయి మరి ముందు ముందు సదరు మీడియా ప్రతినిధులు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి.