
Tirumala : తిరుమలలో నకిలీ దర్శన టిక్కెట్ల కలకలం రేపింది. నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు రూ. 300 టిక్కెట్లుతో భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం ఇచ్చిన కేసు బయటపడింది. కొందరు బ్రోకర్లు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. దీనిపై అనుమానం వచ్చిన టీటీడీ (TTD) విజిలెన్స్ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కొంతమంది భక్తులను ఆపారు. సమగ్ర దర్యాప్తు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు టాక్సీ డ్రైవర్లు నకిలీ టిక్కెట్లను అమ్ముతున్నట్లు నిర్ధారించారు. టీటీడీ సిబ్బంది లక్ష్మీపతి, మణికంఠ, భాను ప్రకాష్‌లు ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా దందా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులను టీటీడీ విజిలెన్స్ అధికారులు, వన్ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు.






