Coolie creativity Low Cost Automation : ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పడం కష్టం. అది వారు చేసే పనిని బట్టి వారిలో క్రియేటీవిటీ బయట పడుతూ ఉంటుంది. సైంటిస్టులు.. మేధావులకు రాని ఆలోచనలు సైతం ఒక్కోసారి సామాన్యులకు వస్తుంటాయి. అలాంటి వాటిని చూసిన వారంతా అబ్బా భలే చేశార్రా అంటూ ప్రశంసలు కురిస్తుంటారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొత్త క్రియేటీవిటీలకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. అచ్చం ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. ఇంజనీర్లు పెద్దపెద్ద మిషన్లతో చేసే పనిని ఓ ఇద్దరు కూలీలు తమ తెలివితో చాలా ఈజీగా చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
ఈ వీడియోను పరిశీలిస్తే.. ఓ ఇంటిని కొందరు కూలీలు నిర్మిస్తుంటారు. రూఫ్ లెవల్ పూర్తయిన రెండో అంతస్థులో పని చేస్తున్నారు. ఈక్రమంలోనే రెండో అంతస్థుకు సిమెంట్ బస్తాలను కేవలం తాడు సహాయంతో పైకి తరలిస్తున్నారు. ఇదే పనిని కూలీలు కాకుండా ఇంజనీర్లు చేస్తే ఓ క్రేన్ సహాయంతోనే లేదా లిప్ట్ తరహా వస్తువులతోనే తరలించేవారు.
కానీ కూలీలు మాత్రం ఇంజనీరింగ్ సిలబస్ లో కూడా నేర్పించని కొత్త ఆలోచనతో తమ పనిని చాలా ఈజీగా చేస్తుండటం గమనార్హం. దీనిని చూసిన నెటిజన్లు తమ దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. లో కాస్ట్ ఆటోమోషన్ అంటూ ప్రశంసలు సైతం కురిస్తున్నారు. దీంతో ఈ వీడియో చూసిన వారంతా ఎవరినీ కూడా తక్కువ అంచనా వేయకూడదని మరోసారి రుజువైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.