
Red sandalwood : ఖర్షీ గ్రామానికి చెందిన రైతు కేశవ్ శిందే తన పొలంలో ఉన్న 100 ఏళ్ల నాటి ఎర్రచందనం చెట్టుకు పరిహారం కోరుతూ రైల్వే శాఖపై హైకోర్టులో కేసు వేశారు. రైల్వే లైన్ నిర్మాణం కోసం ఆయన భూమిని సేకరించినప్పుడు, భూమికి పరిహారం చెల్లించినా, ఎర్రచందనం చెట్టుతో సహా ఇతర చెట్లకు, పైప్‌లైన్‌కు పరిహారం చెల్లించలేదు. ఎనిమిదేళ్లుగా అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
కేసు విచారణలో భాగంగా, ఎర్రచందనం చెట్టు ధర నిర్ణయించకముందే రైల్వే శాఖ కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ చెట్టు విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని రైతు తరపు న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం, చెట్టు ధరను నిర్ధారించడానికి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. భూగర్భ పైప్‌లైన్ , ఇతర చెట్ల పరిహారం కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. రైతు మాత్రం కోర్టు ఆదేశాల మేరకు తగిన పరిహారం లభిస్తుందని ఆశిస్తున్నారు.