
Covid Rules : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ నియంత్రణకు చర్యలు చేపడుతూ వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యమైన ఆంక్షలు ఇవీ:
అన్ని సామూహిక సమావేశాలు తాత్కాలికంగా నిలిపివేత.
రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి.
వృద్ధులు (60 ఏళ్లు పైబడినవారు), గర్భిణీలు ఇంట్లోనే ఉండాలి.
చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం వంటి పరిశుభ్రత పాటించాలి.
రద్దీ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి.
కోవిడ్ లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
ఇతర దేశాల నుంచి వచ్చినవారికి స్క్రీనింగ్ తప్పనిసరి.
ప్రభుత్వ ల్యాబ్లు 24/7 అందుబాటులో ఉంటాయి.
ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతోంది.