
మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల రోజు ఓ గ్లాసు పాలు తాగుతుంటాం. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతారు. పాలు ఔషధంలా పనిచేస్తాయని నమ్ముతుంటారు. పాలలో ఆవు పాలు శ్రేష్టమైనవని భావిస్తుంటాం. ఆవు పాలలో ఎన్నో పోషకాలు ఉన్నాయని అంటారు. అందుకే ఆవు పాలు విరివిగా తాగడానికి ఇష్టపడుతుంటాం.
ఆవు పాలలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కణాలు, కణజాలాలు బాగు చేయడానికి పాలు సాయపడతాయి. ఆవు పాలలో కాల్షియం, మెగ్నిషియం, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి.ఆవుపాలలో తొమ్మిది రకాలైన అమైనో యాసిడ్స్ ఉంటాయి. దీంతో ఇవి బలవర్థకమైన ఆహారంగా చెబుతుంటారు.
ఆవు పాలలో ప్రొటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి12, మెగ్నిషియం, అయోడిన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. దీంతో ఎముకల బలానికి, కండరాల పనితీరుకు సాయపడతాయి. పాలలో వేయిన్, కేసైన్ లు బీపీని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. దీంతో ఆవు పాలతో మనకు ఎంతో బలం కలుగుతుందని విశ్వసిస్తుంటారు.
ఆవుపాలు రోజు తాగడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఇందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. ఆవు పాలలో నాణ్యమైన ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ డి, పాస్పరస్, మెగ్నిషియం ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు పాలు తాగడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.