
cricket rules : వరల్డ్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎప్పటికప్పుడు క్రికెట్ లో కొత్త కొత్త రూల్స్ తేవడం వల్ల ఆటగాళ్లకు క్రీడ మరింత సులువుగా మారుతుంది. క్రికెట్ అభిమానులు కూడా ఐసీసీ నిర్ణయాలపై ఎప్పుడూ సంతృప్తి చెందుతూనే ఉంటారు. దీనిలో భాగంగానే ఐసీసీ కొత్త రూల్ ను తన రూల్ బుక్ లో చేర్చింది. అయితే ఈ నిబంధనలను కూడా వేగంగా అమల్లోకి తీసుకువస్తుంది.
తాజాగా కొన్ని నిబంధనలను రూల్ బుక్ లో చేర్చింది ఐసీసీ. సాఫ్ట్ సిగ్నల్స్ ను గేమ్ నుంచి తొలగించింది. ఎంపైర్ కు పిచ్ లో జరిగింది ఏంటో అర్థం కాని సమయంలో థర్డ్ ఎంపైర్ కు అప్పీల్ చేసేవాడు. వారు చెప్పిన తర్వాత తన అభిప్రాయాన్ని సాఫ్ట్ సిగ్నల్స్ ద్వారా తెలియజేసేవాడు. అయితే ఇప్పుడు ఈ రూల్ ను ఐసీసీ పూర్తిగా రద్దు చేసింది. ఈ నిబంధనలను జూన్ 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఐసీసీ తెలిపింది. అంటే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వరకు నిబంధనలు అమల్లోకి వస్తాయన్నమాట.
ఇక హైరిస్క్ పొజిషన్ల కోసం హెల్మెట్ వాడాల్సిందే..
క్రికెట్ అనూహ్యమైన గేమ్. బాట్ బాల్ మధ్య జరిగే యుద్ధంలా ఉంటుంది. అయితే బౌలర్ బౌలింగ్ వేసే సమయంలో బ్యాట్స్ మన్ దాన్ని ఎదుర్కోలేకపోయి తన ఒంటికి గాయాలవుతాయి. అయితే బాడీలోని హైరిస్క్ జోన్లకు తప్పకుండా హెల్మెట్లు వాడాలని నిర్ణయించింది. ఇది ప్రతీ ఆటగాడు తప్పనిసరిగా పాటించాలని రూల్ బుక్ లో నమోదు చేసింది. గతంలో ఒక్కో బ్యాట్స్ మన్ హెల్మెట్, గార్డ్ లాంటివి ధరించకుండానే గేమ్ లోకి దిగేవారు ఈ నిబంధనతో ఇక అది సాధ్యం కాదు.
కొత్త ఉచిత హిట్ నియమం..
ఐసీసీ ఫ్రీ-హిట్ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. అంటే ఫ్రీ-హిట్ డెలివరీలో బంతి స్టంప్‌లను తాకినా స్కోర్ వస్తుంది. ఇప్పుడు ఆ బాల్ వికెట్లకు తాకితే ఔట్ గా ఇవ్వకుండా ఒక వేళ రన్స్ చేస్తే రన్స్ ను మాత్రమే లెక్కిస్తారు. ఇక ఇప్పుడు బాల్ స్టంప్స్ కు తాకినా.. తాకకున్నా.. బౌండరీకి గానీ వెళ్తే.. ఆ పరుగులను కూడా బ్యాట్స్ మన్ ఖాతాలో వేస్తారు. ఇది బ్యాట్స్ మన్ కు ప్రమోజనం చేకూర్చుతుంది.