Cricket World Cup Song : ప్రపంచం యావత్తు ఆతృతగా ఎదురు చూస్తున్ క్రీడా సంబురాలకు కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ జరగబోతోంది. ఈ సారి వరల్డ్ కప్ కు భారత్ వేదిక కానుంది. దీనిలో భాగంగా ఐసీసీ ప్రత్యేకంగా ఒక సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో రణ్‌వీర్ సింగ్, చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ కనిపించారు. మొదటి రోజు ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఉండగా.. అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడబోతోంది.
ఈ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే మిలయన్ల కొద్ది అభిమానులు యూ ట్యూబ్ లో చూసి షేర్లు, లైకులు చేస్తున్నారు. గతంలో కూడా భారత్ లో వరల్డ్ కప్ పోటీలు జరిగాయి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియాలోనే క్రికెట్ కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారంటే సందేహం లేదు. ఇప్పటికి రెండు సార్లు కప్పు గెలుచుకున్న భారత్ ఈ సారి కూడా సొంతగడ్డపై ఆడి కప్పును దక్కించుకోవాలని కలలు కంటోంది. ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన టోర్నీలో కప్పు గెలుచుకున్న ఇండియా వరల్డ్ కప్ ను కూడా గెలుచుకోవాలని అనుకుంటుంది. భారత జట్టులోని ఆటగాళ్లందరూ మంచి ఫామ్ లో ఉండడంతో ఇది సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఏది ఏమైనా సొంత గడ్డపై జరిగే వేడుకలో కప్పును దక్కించుకొని భారత్ తన ప్రతిష్టను మరింత చాటాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నారు. ఇక వన్డే వరల్డ్ క్రికెట్ కు సంబంధించిన సాంగ్ ను చూసేయండి.