Yuvraj Singh : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తా ను పోటీ చేయబో తు న్నానం టూ వస్తున్న వార్తలను మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఖండించారు. తాను ఎన్నికల బరిలో నిలవడం లేదంటూ స్పష్టం చేశారు. బీజేపీ తరఫున పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి యువరాజ్ సింగ్ ఎంపీగా పోటీ చేయబోతు న్నా డంటూ ఇటీవల జాతీయ మీడియాలో కథనా లు వస్తున్నాయి.
తాను ఎన్నికల బరిలో నిలవడం లేదంటూ స్పష్టం చేశారు. బీజేపీ తరఫున పంజాబ్‌లోని గురుదాస్ పూర్ నుంచి యువరాజ్ సింగ్ ఎంపీగా పోటీ చేయ బోతున్నాడంటూ ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఈ కథనాలపై తా జాగా యువరాజ్ సింగ్ స్పందించారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ వార్తలను ఖండించారు. ఎన్నికల బరిలో నిలవక పోయినప్పటికీ తన యూవీకెన్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసా గిస్తానని వెల్లడించారు.
గత నెలలో యువరాజ్ సింగ్‌ను కేంద్ర మంత్రి నితి న్ గడ్కరీ కలవడంతో ఈ వార్తలు బయటి కొచ్చా యి. ఇక ప్రస్తుతం గురుదాస్‌పూర్ నియోజక వర్గం నుంచి బీజేపీ ఎంపీగా ప్రముఖ నటుడు సన్ని డి యోల్ ఉన్నారు. సన్నీ డియోల్‌ను పక్కనపెట్ట మరి యువరాజ్ సింగ్‌ను బీజేపీ బరిలో దింపనుం దని ప్రచారం జరిగింది.
కానీ తాజాగా యువరాజ్ సింగ్ ఆ వార్తలను ఖండించడంతో ఈ ప్రచారానికి తెరపడింది. 42 ఏళ్ల యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సులు కొట్టి సంచలనం సృష్టించా రు. ఆల్‌రౌండర్‌గా టీమిండియాపై తనదైన ముద్ర వేశాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.