
Cricketers Retirement : ఐసీసీ వన్డే ప్రపంచకప్ అక్టోబర్-నవంబర్ నెలల్లో ఇండియాలో జరగనుంది. జరగనుంది. అంతకు ముందు వెస్టిండీస్‌లో జరిగే ఆసియా కప్ లో టీమిండియా ఆడనుంది. అయితే ఇద్దరు భారత ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఇద్దరి క్రికెట్ కెరీర్ ఇక దాదాపు ముగిసినట్లేనని తెలుస్తున్నది. ఆ ఇద్దరినీ ప్రస్తుత సీజన్‌కు సంబంధించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ చేయలేదు. రెండేళ్లుగా టీమ్ ఇండియాకు సెలెక్ట్ కావడం లేదు. ఈ కారణంగా ఆ ఇద్దరు ప్లేయర్లు త్వరలో రిటైర్మెంట్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.
అతని కెరీర్ ముగిసినట్లే..?
త్వరలో రిటైరయ్యే ఇద్దరు క్రికెటర్లలో మొదటి పేరు మయాంక్ అగర్వాల్. అతని వయసు ప్రస్తుతం 32 ఏళ్లు. అగర్వాల్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 21 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో డబుల్ సెంచరీతో 1488 పరుగులు చేశాడు. అదే సమయంలో, అతను వన్డేల్లో 17.20 సగటుతో 86 పరుగులు తీశాడు. మయాంక్ 2020 నవంబర్‌లో టీమిండియా తరఫున చివరి వన్డే ఆడాడు. కాగా 2022 మార్చిలో శ్రీలంకతో చివరి టెస్టు ఆడింది. అప్పటి నుంచి అతను జట్టులోకి రాలేదు.
ఐపీఎల్‌లోనూ ఫ్లాప్
ఐపీఎల్ 2023లో మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. అతను SRH కోసం 10 మ్యాచ్‌ల్లో 270 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో హాఫ్ సెంచరీ తప్ప ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఇంత దారుణ పెర్ఫామెన్స్ తర్వాత మళ్లీ టీమ్ ఇండియాలోకి రావడం కష్టమే. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పలువురు యువకులు త్వరలో టీమ్‌ఇండియాలో అడుగుపెట్టబోతున్నారు.
ఇషాంత్ శర్మ కూడా ఔట్?
త్వరలో రిటైర్ కానున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్న మరో పేరు వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. ఇషాంత్ మళ్లీ టీమిండియాలోకి వచ్చే అవకాశాలు లేవనే సమాచారం. అతడు తిరిగి జట్టులోకి రావడం అసాధ్యం. రెండేళ్లుగా ఇషాంత్ శర్మ టీమ్ ఇండియా వెళ్లే టూర్లకు ఎంపిక కాలేదు. దీంతో పాటు అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా బీసీసీఐ రద్దు చేసింది. 34 ఏళ్ల ఇషాంత్ శర్మ భారత్ తరఫున 105 టెస్టులు ఆడి 311 వికెట్లు తీశాడు. అదే సమయంలో 80 వన్డేల్లో 115 వికెట్లు, 14 టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు.






