‘Her-1’ Trailer :
ప్రస్తుతం వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సైంధవ్’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న నటి రుహాని శర్మ తన తర్వాతి చిత్రం ‘హర్-1’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్ లో సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీధర్ స్వరరాఘవ వ్రాసి. అతనికి ఈ సినిమా మొదటి చిత్రం. దీనికి సంబంధించిన థియేట్రికల్ ట్రీజర్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే ప్రేక్షకుల దృష్టిని బాగా అట్రాక్ చేసేదిగా కనిపిస్తు్ంది. రుహాని శర్మ అసాధారణమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ని ప్రదర్శిస్తూ, ట్రైలర్ అంతటా తానే కనిపిస్తుంది. పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ గా ఆమె నటన తీరు అందరినీ ఆకట్టకుంది.
మిగిలిన నటులు కూడా పాత్ర మేరకు బాగానే నటించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఒక చనిపోయిన అమ్మాయి గురించి సాగుతున్న ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ మరియు రవి ప్రకాశ్ వంటి అద్భుతమైన నటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
డబుల్ అప్ మీడియా బ్యానర్‌పై రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి ‘హర్-1’ నిర్మించారు. ఈ చిత్రానికి పవన్ సంగీత బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాను జూలై 21వ తేదీన థియేట్రికల్ రిలీజ్ చేస్తు్న్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ సినీ అభిమానుల అటెన్షన్ ను గ్రాబ్ చేసింది. ట్రైలర్ కు భారీ వ్యూవ్స్ దక్కాయి. ఇక థియేటర్లలో ఏ మేరకు ఆడుతుందో చూడాలి.
ఇప్పటి జనరేషన్ కు తగ్గట్లు సస్పెన్స్ థ్రిల్లర్, ఇన్విస్టిగేషన్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిందని, ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు గూజ్ బంబ్స్ గ్యారంటీ అంటూ దర్శకుడు శ్రీధర్ స్వరరాఘవ అంటున్నారు. ఇక నిర్మాణ విషయంలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ కాలేదని నిర్మాతలు తెలిపారు. ప్రతీ నటుడు తన పరిధికి మంచి నటించారని డైరెక్టర్ పేర్కొన్నాడు. ఈ మూవీ ఆకర్షణీయంగా, ఉత్కంఠభరితమైన సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ, ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో రుహాని శర్మ పాత్రపై అంచనాలు పెరుగుతున్నాయి.