- కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
Crime News : గతే ఏడాది న్యూజెర్సీలో నలుగురు సభ్యులున్న భారతీయ కుటుంబం మృతదేహాలు అనుమానాస్పదంగా కనిపించిగా.. ఈ సారి కాలిఫోర్నియాలోని శాన్ మాటియోలో మరో కుటుంబం మృతదేహాలు కనిపించాయి. ఇందులో హృదయ విదారకమైన విషయం ఏంటేంటే ఇద్దరు చిన్నారులైన కవలలు కూడా విగత జీవివులుగా కనిపించారు. అయితే వారిని తల్లిదండ్రులు చంపి సూసైడ్ చేస్తున్నారా? ఎవరైనా నాలుగురిని చంపారా అని అక్కడి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలు కింద ఉన్నాయి.
కాలిఫోర్నియాలోని శాన్ మాటియోలో కేరళకు చెందిన భారత సంతతి కుటుంబానికి చెందిన మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో కనిపించాయి. ఇది హత్యా లేదంటే ఆత్మహత్యా అని తెలియక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద్ సుజిత్ హెన్రీ (42), ఆయన భార్య ఆలిస్ ప్రియాంక (40), వారి నాలుగేళ్ల కవల పిల్లలు నోవా, నీథాన్ 2 మిలియన్ డాలర్ల ఇంట్లో శవమై కనిపించారు.
ఆనంద్, ఆలిస్ బాత్రూంలో బుల్లెట్ గాయాలతో శవమై కనిపించగా. కవల పిల్లలు పడకగదిలో శవమై కనిపించారు, వారి మరణానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది. బాత్రూమ్ నుంచి 9 ఎంఎం పిస్టల్, లోడెడ్ మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ కుటుంబం తొమ్మిదేళ్లుగా అమెరికాలో ఉంటోంది. ఆనంద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా, ఆలిస్ సీనియర్ అనలిస్ట్ గా పని చేశారు. ఇరుగు పొరుగు వారు, సహోద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉంటారు. ఆనంద్ 2016, డిసెంబర్ లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.