
Dimple Hayati : తెలుగు హీరోయిన్ లలో డింపుల్ హయతి ఒకరు.. ఈమె తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది.. ఈ మధ్యనే కాస్త అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ లో తన టాలెంట్ ను బయట పెడుతున్న ఈ బ్యూటీ పై తాజాగా పోలీస్ కేసు నమోదు అవ్వడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.. ఇంతకీ ఈ భామ అంతగా ఏం చేసిందంటే?
విజయవాడకు చెందిన డింపుల్ హయతి గల్ఫ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఖిలాడీ, రామబాణం తదితర సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమాల్లో ఈమె ఏ మాత్రం మొహమాటం లేకుండా తెలుగు అమ్మాయి అయినా కూడా అందాలను బాగా ఆరబోసి హాట్ హీరోయిన్ గా పేరు సంపాదించు కుంది. అయితే ఈ భామ కెరీర్ లో ఇప్పుడిప్పుడే నిలబడుతున్న క్రమంలో ఈమెపై కేసు నమోదు అవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు.
ఈమె ఏకంగా ఒక పోలీస్ అధికారి తోనే గొడవ పడినట్టు తెలుస్తుంది. దీంతో ఈ పోలీస్ అధికారి ఈమెపై మూడు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసారు.. మరి ఈమె పోలీస్ తోనే గొడవ పడడానికి కారణం ఏంటి అని ఆరా తీయగా.. ప్రస్తుతం ఈమె హైదరాబాద్ లోని ఒక అపార్ట్ మెంట్ లో ఉంటుండగా ఇక్కడే పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది.
అదే అపార్ట్ మెంట్ లో ఉన్న రాహుల్ హెగ్డే అనే పోలీస్ అధికారితో తరచూ గొడవ పడుతుందట.. ఆయన ప్రభుత్వ వాహనాన్ని తాజాగా డింపుల్ కు కాబోయే భర్త డేవిడ్ ఢీ కొట్టడంతో ఈ గొడవ కాస్త పెద్దది కావడం.. డింపుల్ కూడా పదే పదే పోలీస్ వాహనాన్ని తన కారుతో ఢీ కొట్టడంతో డింపుల్ పై మూడు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు ట్రాఫిక్ డీసీపీగా పని చేస్తున్న రాహుల్ హెగ్డే తెలిపారు.