Vidhu Vinod Chopra : విధు వినోద్ చోప్రా ‘12 ఫెయిల్’ దర్శకుడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 27న థియేటర్లలో కి వచ్చింది. డిసెంబర్ 29న ఓటీటీలోకి వచ్చింది. విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో చేసిన ఈ సినిమాపై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోవడంతో చిత్ర బృందం వేడుకలు చేసుకుంటుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు విధు వినోద్ చోప్రా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కొన్ని రోజుల వెనక్కి వెళ్తే.. ఆ రోజు మా సినిమా మొదటిసారి స్క్రీనింగ్ వేశాం. ఆ సమయంలో ’100 కోట్లు 1000 కోట్లు కలెక్షన్ల గురించి మాట్లాడుకునే ఈ రోజుల్లో ఈ సినిమాలో ఏం విషయం ఉంది, అసలు ఈ మూవీ తీయడంలో నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇలాంటి సినిమాలు తీశావు’ అంటూ నాన్ను నీనే ప్రశ్నించుకున్నాను. ఆపై నిజాయితీతో సినిమా తీస్తే కలెక్షన్లు అవే వస్తాయని ధైర్యం చేశా. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా భార్యతో సహా అందరూ దీన్ని ఓటీటీలో విడుదల చేయాలని సలహాలు ఇచ్చారు.
‘విక్రాంత్, నువ్వు కలిసి చేసిన 12 ఫెయిన్ ను ఎవరూ చూడరు. వినోద్ ఇలాంటి సినిమాలుకు నేను కలెక్ట్ కాలేను ఓపెనింగ్ కలెక్షన్లు వస్తే ఒక 2 లక్షలు వరకు రావచ్చు మొత్తం 30 లక్షలు వస్తే గొప్పే అంటూ నన్ను భయపెట్టారు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమాకు మార్కెటింగ్ చేశా. విడుదలైన తర్వాత నెమ్మదిగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు’ అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు వినోద్.
అయితే, 12 ఫెయిల్ విషయంలో అందరి అంచనాలు తప్పాయని అందరి ముందు దీన్ని నేను కూడా అంగీకరిస్తున్నా అంటూ వినోద్ చోప్రా భార్య అనుపమ చోప్రా తెలిపారు. ఈ మూవీని రూ. 20 కోట్లతో నిర్మిస్తే రూ. 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.