Scholarship Stanford University : విశాఖ నగరానికి చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ప్రతి ష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చోటు దక్కిం చుకున్నాడు. గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ స్థానాన్ని సాధించాడు. అంతేకాదు కోటి రూపాయల ఉపకార వేతనాన్ని కూడా పొందాడు. ఈ విషయాన్ని సగర్వంగా ఉన్నట్లు చెప్పారు శ్రీరామ్.
అమెరికాలోని ఐవీ లీగ్ యూనివర్సిటీలో కూడా తనకు సీటు లభించిందని, అదే సమయంలో స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో సీట్ రావడంతో అందులోనే చేరా లని నిర్ణయించుకున్నట్టు శ్రీరామ్ వరుణ్ తెలిపా రు. దేశంలో చాలా తక్కువ మందికే స్కాలర్షిప్ తో కూడిన సీటు లభిస్తుందని రాష్ట్రం నుంచి తనకు ఈ అవకాశం లభించిందని శ్రీరామ్ వివరించారు.
ఇంతటి ఘనత సాధించిన శ్రీరామ్ వరుణ్ తల్లిదండ్రులు ఎవరా అంటూ పెద్ద ఎత్తున సెర్చ్ ప్రారంభం అయింది. తండ్రి డాక్టర్ వి.రాజ్‌కమల్ ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శస్త్ర చికిత్స విభాగ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వరుణ్ తల్లి డాక్టర్ సౌదామిని. ఈమె ప్రస్తుతం విశాఖలో ప్రముఖ గైనకాలజిస్టుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్
శ్రీరామ్ వరుణ్ చిన్ననాటి నుంచీ మెరిట్ స్టూడెం ట్. పదవ తరగతి లో ఏ ప్లస్ గ్రేడ్ సాధించి వరుణ్ ఇంటర్మీడియట్లో 983 మార్కులతో స్టేట్ ర్యాంకర్ గా నిలబడ్డాడు..అనంతరం ఐఐటీ జేఈఈ అడ్వాన్సుడ్‌లో ఆల్ ఇండియా 178వ ర్యాంకు సాధించి కాన్పూర్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
అనంతరం క్యాంపస్ ఇంటర్వ్యూ లో సౌత్ కొరియాకు చెందిన సామ్‌సంగ్ సంస్థలో రీసెర్చ్ ఇంజినీరుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం వరుణ్ వార్షిక వేతనం 1.25కోట్ల రూపాయలు. తాజాగా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటును స్కాలర్‌షిప్‌తో దక్కించుకోవడంతో ఉన్నత చదువులకు బయల్దేరి అమెరికా వెళ్తున్నట్లు శ్రీరామ్ వరుణ్ కుటుంబసభ్యులు తెలిపారు.