
Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మే 23 నుంచి 29 వరకు 5.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, టీటీడీకి హుండీ ద్వారా రూ. 25.53 కోట్ల ఆదాయం లభించింది. ఈ సమయంలో 2.5 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. అన్నప్రసాదాల పంపిణీ, క్యూలైన్ల నిర్వహణలో టీటీడీ విశేష సేవలు అందించింది.