
Daddy Heroine : డాడీ సినిమా అంటే చాలా మందికి ఇష్టం.. మెగాస్టార్ నటించిన ఈ సినిమా ఇప్పటికే టివిల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ తో ఆడిపాడిన బ్యూటీ చాలా మందికి గుర్తుకు ఉండే ఉంటుంది.. ఈమె మంచి హైట్ ఉండడమే కాకుండా మెగాస్టార్ కు మంచి జోడీగా కూడా కనిపించి అప్పట్లో ఫ్యాన్స్ ను అలరించింది.
ఈ భామ చేసింది రెండు మూడు సినిమాలే అయిన మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒకటి టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ తో రొమాన్స్ చేయగా.. యంగ్ అండ్ టాలెంట్ లో హీరోతో మరొక సినిమా చేసింది. ఆమె పేరు ప్రేక్షకులకు అంతగా గుర్తు ఉండకపోవచ్చు కానీ డాడీ సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటే మాత్రం ఈమెను గుర్తు పడతారు.
మరి అప్పుడు మెగాస్టార్ తో చిందేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? హిందీ పరిశ్రమ నుండి వచ్చిన ఈ బ్యూటీ పేరు ఆసీమా భల్లా.. ఆమె పేరు చెబితే ఎవ్వరికి తెలియదు కానీ ఈమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకులకు సుపరిచితమే.. నన్ను లాలించు సంగీతం నువ్వే కదా అనే సాంగ్ ప్రేక్షకులకు ఇప్పటికి ఎంతో ఇష్టం..
అలాగే డాడీ సినిమాలో మెగాస్టార్, సిమ్రాన్ తో పోటాపోటీగా నటించి, నర్తించిన ఈ భామ ఇప్పుడు మొత్తం మారిపోయింది. తెలుగులో కేవలం మూడు సినిమాల్లో నటించిన ఈమె హిందీ, తమిళ్ లో కూడా సినిమాలు చేసింది. బుల్లితెర మీద కనిపించి మెప్పించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
సన్నీ మీనన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. వీరికి ఒక పాప కూడా ఉంది. ఈ భామ అప్పటి కంటే మరింత అందంగా, నాజూగ్గా ఉంది.. ఇప్పటి హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోనట్టుగా లుక్స్ తో కుర్రకారును అలరిస్తుంది.
View this post on Instagram






