Daily walk : చాలా మందికి ఉదయం వాకింగ్ చేయాలంటే బద్ధకంగా ఉంటుంది. కానీ దీన్ని అలవాటుగా మార్చుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి రోజూ 30 నిమిషాలు (అరగంట) వాకింగ్ చేస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయట. మారిన జీవనశైలిలో ఎక్కువ సేపు కూర్చొని వర్క్ చేయడం కామన్ గా మారింది. కంప్యూటర్ ఎదుట గంటల కొద్దీ కూర్చొని పనులను చేస్తున్నారు. ఇలా ఎక్కువ సమయం కూర్చొని ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. దీన్ని అవాయిట్ చేసేందుకు రోజుకు 30 నిమిషాల (అరగంట) పాటు నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కూర్చొని వ్యాయామం చేయడం కన్నా వాకింగ్ లేదంటే జాగింగ్ మంచి ఫలితాలు ఇస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
వాకింగ్ వల్ల కండరాలు చురుకుగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర, రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలోకి వస్తాయి. వాకింగ్ వల్ల ఒత్తిడి, చిరాకు తొలగి ప్రశాంతంగా ఉంటుంది. నిద్రలేమి సమస్యలు ఉండవు.
వాకింగ్ వల్ల శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. దీని ద్వారా రక్త ప్రవాహం వేగంగా ప్రయాణిస్తుంది. శరీరంలో వ్యర్ధాలు బయటకు పోతాయి. శక్తి స్థాయిలు పెరగడమే కాదు.. నయం చేసే సామర్థ్యం మెరుగుపరచడంలో సాయం చేస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గుతాయి.
శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగించి అధిక బరువు సమస్య తగ్గించేందుకు నడక సాయపడుతుంది. కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలోపేతం కావడంలోసాయపడి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. నడక అనేది ఉదయం లేదంటే సాయంత్రం 30 నిమిషాలు ఉంటే చాలు..