Big Boss 7 Telugu :
బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి మూడు వారాలు కూడా ముగిసే సమయం అయ్యింది. ఈసారి 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టిన విషయం విదితమే.. వారిలో ఇప్పటికే కిరణ్ రాథోడ్ మొదటి వారం షకీలా రెండవ వారం ఎలిమినేట్ అయ్యింది. ఇక ఇప్పుడు మూడవ ఎలిమినేషన్ ను సమయం ఆసన్నం అయ్యింది. నామినేషన్స్ లో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తుంటారు అనే విషయం విదితమే..
అలానే కిరణ్, షకీలా ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం 12 మంది హౌస్ లో ఉండగా వారిలో 7 మంది నామినేషన్స్ లో ఉన్నారు. శుభ శ్రీ, దామిని, గౌతమ్, యావర్, ప్రియాంక, రతికా, అమర్ దీప్ లు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్రా ఉండడంతో ఇంటి సభ్యులుగా అర్హత సాధించుకున్నారు..
ఇక ఇప్పుడు మూడవ వారం ఇంటి సభ్యురాలిగా శోభా శెట్టి కన్ఫర్మ్ అయ్యింది.. ఇదిలా ఉండగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారు అనేది ఇప్పటికే లీక్ అయ్యింది. ఓటింగ్ లో ప్రిన్స్ యావర్ టాప్ లో నిలిచాడు. ఇక మూడవ వారం గురించి ముందు నుండి ఎలిమినేట్ అవ్వబోయేది సింగర్ దామిని అని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
అందులోను ఈమెకు ఓటింగ్ కూడా తక్కువుగా వచ్చినట్టు తెలుస్తుంది. ఈమె ఇప్పటికే స్టేజ్ మీదకు వచ్చిందని, ఆమె బిగ్ బాస్ జర్నీ వీడియో కూడా ప్లే చేసినట్టు సమాచారం.. ఈమె ప్రిన్స్ పట్ల ప్రవర్తించిన తీరుతో ఈమెపై బయట బాగా నెగిటివిటీ పెరిగి పోయింది. అంతేకాదు ఈమె హౌస్ లో చేసిన ఎక్స్పోజింగ్ పై కూడా ట్రోలింగ్ జరుగుతుంది. మొత్తానికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అనుకుంటే మూడవ వారానికే బయటకు వచ్చేసింది.