Damini Remuneration :
బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి మూడు వారాలు కూడా ముగిసింది. సీజన్ 7లో ఈసారి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే వచ్చారు.. వారిలో కిరణ్ రాథోడ్ మొదటి వారం షకీలా రెండవ వారం ఎలిమినేట్ అయ్యింది. ఇక ఇప్పుడు మూడవ ఎలిమినేషన్ కూడా ముగిసింది.. నిన్న వీకెండ్ ఎపిసోడ్ జరుగగా మూడవ ఎలిమినేషన్ ను కూడా నాగార్జున ప్రకటించారు.
మూడవ ఎలిమినేషన్ లో దామినిని ఎలిమినేట్ అయ్యింది. ఓటింగ్ లో ప్రిన్స్ యావర్ టాప్ లో నిలిచినట్టు తెలుస్తుంది. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న దామిని ప్రిన్స్ పట్ల ప్రవర్తించిన తీరుతో ఈమెపై బాగా నెగిటివిటీ పెరిగి పోయింది. ఈమె చేసిన పని కారణంగానే అంత తక్కువ ఓటింగ్ అయితే నమోదు అయ్యింది..
మొత్తానికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అనుకుంటే మూడవ వారానికే బయటకు వచ్చేసింది. ఇక ఈమె హౌస్ నుండి బయటకు రావడంతో ఈమె బిగ్ బాస్ కోసం వారానికి ఎంత అందుకుంది.. మూడు వారాల్లో ఎన్ని లక్షలు వసూలు చేసిందో అనే అప్డేట్ నెట్టింట వైరల్ అయ్యింది..
బాహుబలి సినిమాలో పాట పాడి ఈ అమ్మడు బాగా ఫేమస్ అయ్యింది. దీంతో ఈమెకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది.. సోషల్ మీడియాలో కూడా తన అందంతో భారీ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ భామ బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. ఇక హౌస్ లో హాట్ షో చేస్తూ అందరికి షాక్ ఇచ్చింది.. ఈమెకు హౌస్ లో వారానికి 2 లక్షలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మూడు వారాల్లో ఈమెకు అన్ని కటింగ్స్ పోగా 5 లక్షల వరకు అందుతున్నట్టు తెలుస్తుంది..