
Adani Hindenburg Case:
అదానీ-హిండెన్ బర్గ్ కేసులో సెబీ మళ్లీ సుప్రీం కోర్టు గడపతొక్కింది. అయితే ఈ సారి దర్యాప్తు నివేదిక అందించేందుకు కాదట..
ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నివేదిక సమర్పించేందుకు మరో 15 రోజుల గడువు కావాలని మార్కెట్ రెగ్యులేటర్ సుప్రీంలో దాఖలు చేసిన దరఖాస్తులో స్పష్టం చేసింది. ఇదే కేసు విషయమై గతంలో సుప్రీం కోర్టు సెబీకి ఆగస్ట్ 14వ తేదీ వరకు గడువు ఇచ్చింది. సెబీ మళ్లీ గడువు కోరడంతో ఆగస్ట్ 29న విచారణ తేదీగా నిర్ణయించింది. ఈ అంశం సెబీ తుది నివేదికను ఆగస్ట్ 29న సమర్పించనుంది.
ప్రఖ్యాత అకౌంటింగ్ సంస్థ అదానీ పోర్ట్స్ కంపెనీ చట్టబద్ధమైన ఆడిటర్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం మార్కెట్ల ఇంట్రాడే ట్రేడింగ్ లో అదానీ గ్రూప్ కంపెనీల కు సంబంధించి షేర్ విలువ క్షీణతను నమోదు చేసింది. ఆడిటర్ రాజీనామాకు ముందు డెలాయిట్ అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై విచారణకు పిలుపునిచ్చింది. ఈ ఆరోపణలు తమ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపలేదని, డెలాయిట్ రాజీనామాకు గల కారణాలు సంతృప్తికరంగా లేవని అదానీ పోర్ట్స్ పేర్కొంది.
ఈ రోజు (ఆగస్ట్ 14) మార్కెట్ లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 4.50 శాతానికి పైగా నష్టపోతున్నాయి. ఇదే క్రమంలో అదానీ పోర్ట్ అండ్ సెజ్ స్టాక్ 2.75 శాతం క్షీణతను నమోదు చేసింది. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్, అదానీ విల్మార్ షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు 3.50 శాతం పతనం అయ్యాయి. ఇక సిమెంట్ కంపెనీల గురించి తెలుసుకుంటే ఏసీసీ షేర్లు 2 శాతం, అంబుజా షేర్లు 3.50 శాతం పడిపోగా.. ఎన్డీటీవీ షేర్లలో 1.5 శాతం పడిపోయింది.






