
Dasara collections : న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.. ఈయన ఎంతో కస్టపడి పైకి వచ్చాడు.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు.. నాని సహజమైన నటనతో ఏ సినిమాలో అయినా ఆడియెన్స్ ను మెప్పిస్తాడు.. ఇక ఇటీవలే నాని దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.. నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసుకుంది.. ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. మొదటి షో తోనే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
అప్పుడు మొదలెట్టిన దసరా దండయాత్ర ఇప్పటికి పూర్తి అయ్యింది. మరి టోటల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కలెక్షన్స్ రాబట్టింది అంటే.. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ ”దసరా”.. నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 34.65 కోట్ల బిజినెస్ చేయగా ప్రపంచ వ్యాప్తంగా 48 కోట్ల బిజినెస్ చేసింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 44.81 కోట్ల వసూళ్లను రాబట్టగా ప్రపంచ వ్యాప్తంగా 63.55 కోట్ల షేర్, 115.60 కోట్ల గ్రాస్ అందుకుంది. ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అంటే 14.55 కోట్ల లాభాలను నిర్మాతలకు అందించింది.