TS TET 2023 :
తెలంగాణలో టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్.. ఈ ఏడాది సెప్టెంబర్ లో టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. చాలా రోజులుగా నిరుద్యోగులు టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి టెట్ నిర్వహించి ఆ తర్వాత టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు అనుగుణంగా తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
అయితే ఈ క్రమంలో టెట్ నిర్వహించేందుకు సుమారు 101 రోజుల గడువు అవసరం ఉంటుందని విద్యాశాఖ ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసేందుకు ఈ గడువు అవసరం అని విద్యాశాఖ తెలిపింది. అయితే సెప్టెంబర్ లో టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ తర్వాత టీఆర్టీ ద్వారా 9370 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇటీవల జరిగిన మంత్రుల సమావేశంలో ఈ మేరకు టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై నిరుద్యోగుల నుంచి సంతోషం వ్యక్తం అయింది. ఇప్పటికే చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వారందరికీ ఇది నిజంగా శుభవార్త. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే పలు నోటిఫికేషన్లను విడుదల చేసిన ప్రభుత్వం ఆయా ఎగ్జామ్ లను నిర్వహిస్తున్నది. వీటితో పాటు టెట్ ను కూడా నిర్వహించాలని భావించింది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 4, తదితర ఎగ్జామ్ లను పూర్తి చేసింది. మరోవైపు సెప్టెంబర్ లో టెట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది.
ReplyForward
|