39.2 C
India
Thursday, June 1, 2023
More

  Deepavali : దీపావళికి యూఎస్ లో హాలిడే..  అక్కడి చట్ట సభల్లో బిల్లు

  Date:

  Deepavali
  Deepavali, USA
  Deepavali : భారత్ అంటే ప్రేమనో.. ప్రధాని నరేంద్ర మోడీపై అభిమానమో తెలియదు గానీ ఆమెరికా హిందూ పండుగలు హిందూ వ్యక్తులకు ఈ తొమ్మిదేళ్లలో బాగా విలువనిస్తూ వస్తుంది. చీకటిని రూపుమాపి వెలుగులు నింపే దీపావళికి అగ్రరాజ్యం అగ్రపీటం వేసింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తే దీపావళి. ఈ పండుగ సందర్భంగా వేడుకలు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లో గతేడాది ప్రారంభమైంది. ఆ దేశాధ్యక్షుడు జోబైడెన్ జ్యోతి వెలిగించి దీపావళి పండుగను ప్రారంభించారు. ఈ వేడుకల్లో 250 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. అధ్యక్ష భవనంలో ప్రారంభమైన వేడుకలకు భారీ సంఖ్యలో ప్రముఖులు రావడం పండుగ ఖ్యాతిని చాటి చెప్పింది. భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రతిభింబించేలా ఈ వేడుకలను నిర్వహించింది వైట్ హౌజ్.

  ఇంతటి ప్రాముఖ్యత సంపాదించుకున్న ఈ పండుగకు సెలవు ఇవ్వాలని వాదనలు వినిపించాయి. దీంతో బైడెన్ ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తుంది. దీపావళి పండుగ రోజు సెలవు దినంగా ప్రకటించేందుకు అమెరికా చట్ట సభల్లో బిల్లు పెట్టబోతోంది. 2023 దీపావళి నాటికి ఇది వాస్తవ రూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది. ఈ పండగ కు ఫెడరల్ హాలిడే ప్రకటించాలంటూ యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్.. ఓ బిల్లును ప్రతిపాదించింది.

  ‘న్యూ పార్లమెంట్ భవనం ఫస్ట్ లుక్ దివాళీ డే యాక్ట్’ పేరుతో రూపొందించిన ఈ బిల్లును డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు గ్రేస్ మెంగ్ ప్రవేశపెట్టారు. ఆమె మాట్లాడుతూ దీవాళీ డే బిల్లును సభలో ప్రవేశపెట్టినందుకు గర్వంగా ఉందని ఆమె అన్నారు. దీవాళీ రోజు ఫెడరల్ హాలీడేగా ప్రకటించాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరో  కాంగ్రెస్ సోనియల్ డిస్ట్రిక్ట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  • అయితే ఇప్పటి వరకూ అమెరికాలో 11 ఫెడరల్ హాలీడేలు అమల్లో ఉన్నాయి.
  జనవరి 1, న్యూ ఇయర్ డే..
  జనవరి 16, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే..
  ఫిబ్రవరి 20, ప్రెసిడెంట్స్ డే..
  మే 29, మెమోరియల్ డే..
  జూన్ 19, జునెటెంత్ డే,
  జూలై 4, ఇండిపెండెన్స్ డే..
  సెప్టెంబర్ 4, లేబర్ డే..
  అక్టోబర్ 9, కొలంబస్ డే.. ఇండిజీనస్ పీపుల్స్ డే..
  నవంబర్ 11, వెటరన్స్ డే..
  నవంబర్ 23,  థ్యాంక్స్ గివింగ్ డే..
  డిసెంబర్ 25- క్రిస్మస్..ను ఫెడరల్ హాలిడేగా నిర్వహించుకుంటున్నారు అమెరికన్లు.

  ఇక దీపావళి బిల్లు కూడా ఆమోదం పొందితే ఈసంఖ్య 12కు చేరుతుంది. ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు కూడా న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్ కుమార్ ప్రకటించారు. ఈ ఏట దీపావళిని ఫెడరల్ హాలీడేగా నిర్వహించుకుందామని అన్నారు. హాలీడే వస్తే అమెరికాలోని దక్షిణాసియా వారిని గౌరవించుకున్నట్లు అవుతుందని అన్నారు.

  Share post:

  More like this
  Related

  మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒక మూవీ చేశారు తెలుసా..?

      టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లోనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు మెగాస్టార్...

  ఆయన ఆశీస్సులు తనపై ఉంటాయి.. కృష్ణను గుర్తు చేసుకున్న నరేశ్..

      తండ్రి స్థానంలో ఉంటూ తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చూసుకున్న సూపర్...

  అల్లుడితో లేచిపోయిన అత్త..!

        మాతృపంచకంలో అత్తా కూడా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. తల్లి తర్వాత...

  దేశంలో పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా?

        వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి చాలా మంది అందమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు....

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related