
Deer dance : శ్రీరామ నామ స్మరణ ఎంతో మాధుర్యాన్ని కలిగిస్తుంది. ఆలయాల్లో భక్తులు, హనుమాన్ దీక్షాపరులు ఈ నామ స్మరణలో నిత్యం తన్మయత్వంతో ఊగిపోతుంటారు. భజన సందర్భాల్లో, ఇతర పూజా కార్యక్రమాల్లో కూడా శ్రీరామ నామస్మరణ వినసొంపుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక జింక పిల్ల కూడా శ్రీ రామ నామస్మరణకు ఆడిపాడింది. అక్కడి స్థానికులతో అది చేసిన నృత్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతా అది చూస్తూ శ్రీరామ నామస్మరణకు ఉన్న బలం అంటూ చర్చించుకున్నారు.
ఎక్కడో కొండకోనల్లో శ్రీరామ నామస్మరణ చేస్తూ కొందరు నృత్యం చేస్తున్నారు. చిన్నాపెద్ద అంతా కలిసి అందులో పాలుపంచుకున్నారు. అక్కడ వారి రిథమ్, సౌండ్ కు ఓ జింక కూడా పరవశించింది. వారితో పాటు స్టెప్పులు కలిపింది. తాను కూడా తన్మయత్వంతో ఎగురుతూ నృత్యం చేస్తుంది. ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరూ ఈ వీడియోను చూస్తూ రామ నామ స్మరణలో ఇంత మహత్యం ఉందని చర్చించుకుంటున్నారు. వీడియోలో చూస్తే మాత్రం జింక అక్కడి వారితో కలిసే నివసిస్తూ ఉంటుందని అర్థమవుతున్నది. అక్కడ వారి స్టెప్పులు గమనిస్తూ ఆ జింక పిల్ల అనుసరించడం మొదలు పెట్టింది. దీంతో అక్కడున్న వారంతా కూడా మరింత ఉత్సాహంతో నృత్యం చేయడం మొదలుపెట్టారు. ఇక ఆ జింక పిల్ల మాత్రం తన జోష్ తగ్గించలేదండోయ్.. శ్రీ రామ నామస్మరణ కొనసాగినంత సేపు అది కూడా అలా గంతులెస్తూ అందరినీ ఆకట్టుకుంది.