
Major General SP Sinha : 2014కు ముందు యూపీఏ ప్రభుత్వంలో, 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత రక్షణ విధానానికి ఎంతో తేడా ఉందని ఓ టీవీ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్పీ సిన్హా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భారత రక్షణ దళాలకు ప్రధాని మోదీ ఇచ్చినంత స్వేచ్ఛ, ప్రాధాన్యం కాంగ్రెస్ పాలకులు ఇవ్వలేదన్నారు.
మోదీ భారత ఆర్మీని, ఇతర రక్షణ దళాలే తన కుటుంబంగా భావించారన్నారు. అందుకే దీపావళి రోజు రాజకీయ నాయకులంతా ఇండ్లలో పండుగను జరుపుకుంటే మోదీ సరిహద్దుకు వెళ్లి భారతీయ సైనికులతో దీపావళి పండుగు జరుపుకున్నారని కొనియాడారు. మోదీ సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ తోకముడిచిందన్నారు. భారత్ సరిహద్దులో కుట్రలు పన్నితే ఊరుకునేది లేదని మోదీ శత్రుదేశాలను హెచ్చరించారన్నారు. సరిహద్దులో శత్రుదేశాల సైనికుల ఎత్తులను చిత్తు చేసేందుకు భారత సైన్యానికి మోదీ స్వేచ్ఛ ఇచ్చారన్నారు. వారిపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో దేశ రక్షణకు అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు.
రక్షణ విధానంలో భాగంగా అత్యంత ఆధునాతన యుద్ధ విమానాలు, పరికరాలను కొనుగోలు చేశారన్నారు. అలాగే రక్షణ పరికరాల తయారీలో మేకిన్ ఇండియాను ప్రారంభించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ముంబై దాడులు జరిగితే హోంమినిస్టర్ 8 గంటల తర్వాత అక్కడికి వెళ్లారని, వాస్తవానికి ముంబైకి వెళ్లడానికి గంటన్నర సరిపోతుందన్నారు. దేశంపై కాంగ్రెస్ వాళ్లకు ఉన్న ప్రేమ అలాంటిది అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్, చైనా మన దేశంపై సరిహద్దులో కుట్రలు పన్నడమే కాదు అంతర్గత బాంబు బ్లాస్టింగ్ లు చేసేవారన్నారు. కానీ మోదీ వచ్చాక మన వైపు చూడాలంటేనే వణికిపోతున్నారన్నారు.
“The situation of our defence forces and country before 2014 and now is poles apart”
– Major General SP Sinha (Retd.)
Every Indian must listen this and make it viral.
Because Dhruv Rathee will never make video on this or not even mention it in any of his videos. pic.twitter.com/r4B4BZxKvw
— Sunanda Roy 👑 (@SaffronSunanda) May 20, 2024