
Delhi BJP : ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. నాలుగోసారి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ .. మరోవైపు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈసారైనా జెండా ఎగురవేయాలని బీజేపీ పోటీ పడుతున్నాయి. అలాగే మధ్యలో కాంగ్రెస్ పార్టీ కూడా.. పీఠం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీదే విజయం అంటూ ప్రకటించేశాయి. ఫలితాలు కూడా బీజేపీ ఏకపక్ష విజయం అని చూపిస్తాయి.. ఇప్పటికీ 48 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉండడంతో ఆ పార్టీదే అధికారం అని కన్ఫమ్ అయ్యింది. దీంతో బీజేపీ నాయకుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది.
అయితే ఢిల్లీ పీఠం బీజేపీ సొంతమైతే.. సీఎం ఎవరవుతారనే విషయంపై అంతా చర్చింకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్‌దేవా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేసులో ముందు వరుసలో ఉండగా.. ఎంపీ మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ, రమేశ్ బిధూడీ కూడా సీఎం రేసులో ఉన్నారు. . ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్‌దేవా, ప్రవేశ్ వర్మ.. ఈ ముగ్గురిలో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
కొన్ని రోజుల కిందట ఆప్ అధినేత కేజ్రీవాల్.. ఏకంగా బీజేపీ సీఎం అభ్యర్థి రమేశ్ బిధూడీ అని తన మనసులో మాట చెప్పిన విషయం తెలిసిందే.