నార్త్ అమెరికాలో ఒక్క చోటే కేవలం 4 నుంచి 5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని అందుకుంటుందని భావిస్తున్నారు. కాగా వరల్డ్ వైల్డ్ గా సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ కూడా పాన్ ఇండియా లెవల్ కి వెళ్లిపోవడంతో భారీగా కలెక్షన్లు రావడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం సినిమా విడుదల మొదటి రెండో షో పూర్తి కావొస్తుంది. ఇప్పటి వరకు మిశ్రమ స్పందన కనిపిస్తుంది.
పబ్లిక్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. శని, ఆదివారాలు సినిమా చూసేందుకు ప్రేక్షకులు తరలిరానున్నారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కడప లో రాజా థియేటర్ లో ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షో వేయగా.. టికెట్లు కొన్న వారి కంటే ఎక్కువ మంది రావడంతో తోపులాట జరిగింది. ఇలా దేవర సినిమా ఫస్ట్ షో లలో చాలా చోట్ల అభిమానుల తోపులాట జరిగింది. మొత్తం మీద చాలా ఏండ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మూవీ హిట్ కావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.