Devara NT : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో ఎన్టీఆర్ ‘దేవర’ ఒకటి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ వంటి సినిమాతో తన స్టార్ డమ్ ను విస్తరించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతుంది..
ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘దేవర’ సినిమాతో కొరటాల ఎన్టీఆర్ ను వీర మాస్ లెవల్ లో చూపించడానికి సిద్ధం అయ్యాడు. ఎన్టీఆర్ కూడా వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పటికే హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటు హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది.
ఇక ఇటీవలే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ సైఫ్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. ఇవన్నీ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచేసాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి రెండు పిక్స్ రిలీజ్ అయ్యాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దేవర సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ రెండు పిక్స్ షేర్ చేసారు..
AI ఇల్యూషన్ టూల్ తో ఎన్టీఆర్ ముఖాన్ని ఇందులో సృష్టించారు. సముద్రం ఒడ్డున ఉన్న పడవలతో ఎన్టీఆర్ పేస్ ను డిజైన్ చేయగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇవి ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఈ పిక్స్ చూసి సంతోషం వ్యక్తం చేస్తూ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది.