Devara Trailer : గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ బాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉంది. ఇప్పటి వరకు సినిమా యూనిట్ కథ ఏంటో చిన్న హింట్ ఇవ్వలేదు. దీంతో ట్రైలర్ కోసం సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ సందర్భం రానే వచ్చింది. దేవర ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ట్రైలర్ నిడివి 2 నిమిషాల 40 సెకన్లు ఉంది.. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు, ధైర్యం తప్ప ఏమీ తెలియని వాళ్లకి మొదటి సారి భయం పొరలు కమ్ముకున్నాయి. అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అయింది. యాక్షన్ సీక్వెన్స్, ఎన్టీఆర్ డైలాగులు అదరహో అనిపించాయి. మొత్తంగా ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. స్టన్నింగ్ ట్రైలర్ అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ భైరాగా నటిస్తుండగా, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కోనరాజు హరికృష్ణ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ట్రైలర్ విడుదలకు ముందే ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద ప్రీ సేల్స్ లో రూ.8.2 కోట్ల మార్క్ ను క్రాస్ చేసి అరుదైన ఘనతను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదలకు ముందే 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగా అరుదైన రికార్డును నమోదు చేసింది.