Devara Update: కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న చిత్రం ‘దేవర’. భారత్ లో దేవర మూవీ నిడివి తగ్గిందన్న వార్తలు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. దాదాపు 18 నిమిషాలకు పైగా సినిమాకు తొలగించడంతో కొంత ఆందోళన చెందుతున్నారు. విదేశాలలో టెలీకాస్ట్ నిడిపి పూర్తిగా ఉంచి భారత్ లో మాత్రం తగ్గిండచంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.
సెన్సార్ కట్ తర్వాత ఈ సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాలు. అయితే అమెరికాకు పంపిన ఐమాక్స్ వెర్షన్ నిడివి 3 గంటల 10 నిమిషాలు. ఈ రెండింటి మధ్యలో దాదాపు 18 నిమిషాల వరకు కట్ చేశారు. అంతర్జాతీయ వెర్షన్ భారత్ వెర్షన్ కంటే పొడవుగా ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
నిడివిలో తేడాలు ఉన్నప్పటికీ, అవుట్ పుట్ ను ఖరారు చేసేందుకు మొత్తం 18 నిమిషాలు తగ్గించడానికి ముందు సినిమా యూనిట్ ప్రతీ వెర్షన్ ను అనేకసార్లు సమీక్షించినట్లు సమాచారం. మొత్తం మీద సెన్సార్ రిపోర్ట్ పై విపరీతమైన బజ్, క్యూరియాసిటీతో ‘దేవర’ ఫీవర్ టాలీవుడ్ ను చుట్టుముట్టింది. ఈ వారంలో ప్రీరిలీజ్ ఈవెంట్ తో పాటు రెండో ట్రైలర్ లాంచ్ చేయడం వల్ల సినిమాపై క్లారిటీ వస్తుందని అంతా భావిస్తున్నారు.
అయితే పూర్తి నిడివి ఉంచితే బాగుంటుందని తారక్ ఫ్యాన్స్ కోరుతున్నారు. యంగ్ టైగర్ సినిమాలకు దాదాపు రెండేళ్లకు పైగా దూరం ఉన్నామని ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు రావడం ఆనందంగా ఉందని, కానీ ఇందులో కూడా ఇలా కట్ చేయడం మంచిది కాదని వాపోతున్నారు. అయితే దీనిపై మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.