
Rashmika vadhina : రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.. ఈమె ఒకప్పుడు సౌత్ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం.. ఈ కన్నడ బ్యూటీ ఛలో సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఇక అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ – రష్మిక పెయిర్ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా ఇష్టం..
గీతా గోవిందం సినిమాలో వీరి కెమిస్ట్రీకి అందరు ఫిదా అయ్యారు.. అప్పటి నుండి వీరి మధ్య ఏదో నడుస్తుంది అని తరచు వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఇద్దరు ఖండిస్తూనే ఉన్న రూమర్స్ మాత్రం ఆగడం లేదు.. ఈమె విజయ్ ఫ్యామిలీతో కూడా సన్నిహితంగా ఉండడంతో కాబోయే కోడలిని వీరు కూడా యాక్సెప్ట్ చేసారు అని కూడా టాక్స్ వచ్చాయి..
ఇప్పటికి కూడా వీరి మధ్య సీక్రెట్ లవ్ నడుస్తుంది అని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ న్యూ మూవీ లోని సాంగ్ లాంచ్ కు రష్మిక మందన్న రావడం ఆసక్తికరంగా మారింది. ఆనంద్ సాయి రాజేష్ దర్శకత్వంలో చేస్తున్న బేబీ సినిమాలో సాంగ్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఈమె విచ్చేసింది.
ఈ ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ ఉండగానే విజయ్ ఫ్యాన్స్ అంతా వదిన వదిన అంటూ గోల గోల చేయడం స్టార్ట్ చేసారు.. దీంతో రష్మిక ఏం మాట్లాడకుండా స్మైల్ తోనే మ్యానేజ్ చేసింది.. ఆనంద్ దేవరకొండ కోసం తన సినిమా షూటింగులను పక్కన పెట్టి మరీ ఈ అమ్మడు రావడంతో దేవరకొండ ఫ్యామిలీకి ఈమె ఎంత క్లోజ్ గ అంటుందో అర్ధం అవుతుంది.. మొత్తానికి వీరి మధ్య బంధం ఎలాంటిందో ముందు ముందు అయిన బయట పడుతుందో లేదో వేచి చూడాలి..