
విజయ్ దేవరకొండ లైగర్ డిజాస్టర్ నుంచి కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాడు. ఆయన కెరీర్ లో లైగర్ మూవీ కోలుకోలేని దెబ్బ తీసిందనే చెప్పాలి. స్టార్ డైరెక్టర్ ఆయనే నిర్మాణంలో భాగస్వామ్యం వహించినా సినిమా మాత్రం భారీ ఫ్లాపును ఎదుర్కొంది. ఇవన్నీ పక్కనుంచితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగానే ఉన్నారు. ఆయన సమంతతో కలిసి చేస్తున్న ‘ఖుషి’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. సమంత అనారోగ్య కారణాలతో కొన్ని రోజులు నిలిచిపోయిన షూటింగ్ యధావిధిగా కొనసాగుతుంది.
ఇక విజయ్ దేవరకొండ తర్వాతి చిత్రం ప్రారంభమైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక చిత్రానికి బుధవారం (మే 3) రోజు ముహూర్తం షాట్ తీశారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. విజయ్ దేవరకొండ 12వ చిత్రం ఇది. ఆయనకు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. ముహూర్తపు షాక్ ను సౌత్ కొరియా హానరరీ కౌన్సిల్ జనరల్ చుక్కపల్లి సురేశ్ క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించగా, ప్రగతి ప్రింటర్స్ యండీ మహేంద్ర పరుచూరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ మూవీకి నిర్మాతలుగా నాగవంశీ, సాయి సౌజన్య వ్యవహరిస్తున్నారు. ఫేమస్ ప్రొడ్యూసర్ ఎస్ రాధాకృష్ణ (చినబాబు) చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. న్యాచురల్ స్టార్ నాని జర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరితో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్ రూపొందిస్తున్ తర్వాతి సినిమా ఇది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ఓ గూడచారి గా ఉంటుంది తెలుస్తోంది. సంగీతం అనిరుధ్ రవిచందర్ సమకూర్చనున్నారు.
షూటింగ్ ను వేగంగా నిర్వహించి త్వరలోనే ఆడియన్స్ ముందుకు తెస్తామని దర్శకుడు గౌతమ్, సితార ఎంటర్ టైన్ మెంట్ చెప్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ షూటింగ్ బిజీలో ఉన్నారు. దీనితో పాటు ఈ సినిమాకు కాల్ షీట్లు సిద్ధం చేస్తున్నారు.






