Devineni Avinash : దేవినేని అవినాష్.. పల్నాడు పౌరుషానికి ప్రతీక అయిన దేవినేని నెహ్రూ రాజకీయ వారసత్వాన్ని అవినాష్ కంటిన్యూ చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రబలంగా నిలబడుతున్నాడు. ముఖ్యంగా గత ఎన్నికల్లో గుడివాడలో నిలబడి ప్రత్యర్థులను భయపెట్టాడు మన దేవినేని అవినాష్. గడిచిన ఎన్నికల్లో దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ ను టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. కానీ ఓటమి చవిచూశారు. ఎన్నికల అనంతరం అవినాష్ వైసీపీ గూటికి చేరారు.
ఇక అమెరికాలోనూ దేవినేని అవినాష్ కు అపూర్వ ఆదరణ దక్కుతోంది. ఆయన వినయం విధేయత.. ఎన్నారైలతో కలుపుగోలుతనం అందరినీ ఆకట్టుకుంటోంది. అమెరికాలోని ప్రతి నగరానికి చాలా సమయం సందర్భంగా పంక్చువాలిటీతో క్రమశిక్షణతో అన్న టైం ప్రకారం హాజరవుతూ దేవినేని అవినాష్ ఎన్నారైల మనసు దోచుకుంటున్నారు.
అంత పెద్ద నేత కుమారుడు అయినా కూడా దేవినేని అవినాష్ ఎన్టీఆర్ లాగా సింప్లిసిటీగా ప్రవర్తిస్తున్నారు. నెహ్రూ గారి టైమ్ సెన్స్ అవినాష్ లోనూ వచ్చాయి. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నారు.
అమెరికాలో దేవినేని అవినాష్ వరుసగా మన ఎన్నారై ప్రముఖులను కలుస్తూ వారితో కలిసి తిరుగుతూ.. సేవా, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అలరిస్తున్నారు.
-దేవినేని అవినాష్ అమెరికా పర్యటనలో పాల్గొన్న వీడియోను కింద చూడొచ్చు.