Devineni Avinash : వైసీపీ నేత అవినాష్.. ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత.. విజయవాడ ప్రజలకు సుపరిచితమైన రాజకీయ కుటుంబం ఆయనది. దేవినేని నెహ్రు కుమారుడు అవినాష్ అమెరికాలోని న్యూజెర్సీలో పర్యటిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి ఆయన అమెరికాకు చేరుకున్నారు. కాగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడి తెలుగు వారితో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా జైస్వరాజ్య జేఎస్ డబ్ల్యూ ఛానల్ చైర్మన్ జై ఎలిమ అంజలిగారితో పాటు మరికొందరు ఎన్నారైలు ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా ఆయన జైస్వరాజ్య జేఎస్ డబ్ల్యూతో మాట్లాడుతూ ఇక్కడి రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలుగు వారు ఇక్కడ ఉన్నత స్థానాల్లో ఉండడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పారు. ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా వారు ఉన్నత స్థానాల్లో ఉండడం అభినందనీయమన్నారు. నెహ్రూ వారసుడిగా తన 18 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. తన తండ్రి లాగే విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో తమ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా శ్రమిస్తానని చెప్పారు. ఏపీ సంక్షేమంలో టాప్ లో ఉందని, మరోసారి కూడా ఏపీ ప్రజలు కూడా జగన్ కు అండగా ఉంటారని తెలిపారు. తన తూర్పు నియోజకవర్గంలో అన్ని రకాల మౌళిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని , కృష్ణా కరకట్ట ప్రాంతాల్లో 130 కోట్లతో రిటైనింగ్ వాల్ జగన్ నాయకత్వంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
-వైసీపీదే విజయం
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీలో ఉన్నా రానున్న ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. జగన్ నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్నారని తెలిపారు. ప్రజకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నానని, ఇకపై కూడా ఉంటానని చెప్పుకొచ్చారు.