Aadipursh movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ నిరాశ పరచింది. ఎంతో వైవిధ్యంగా తీశామని చెబుతున్నా విమర్శలు ఎదుర్కొంది. చాలా మంది వాల్మీకి రామాయణాన్ని కించ పరచారని కోర్టుకు సైతం వెళ్లారు. సినిమాను రద్దు చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. కానీ సినిమా నాలుగు రోజులే కలెక్షన్లు వచ్చాయి. తరువాత నిష్క్రమించింది.
విమర్శల పాలైన సినిమా నిరాశపరచింది. ప్రభాస్ ఫ్యాన్స్ కు నిస్తేజం కలిగింది. దీనిపై హైకోర్టులో కేసులు కూడా వేశారు. కానీ అంత దూరం సినిమా వెళ్లలేదు. ఎన్నో ఆశలతో విడుదలైన సినిమా అంతే వేగంగా ప్లాప్ ను మూటగట్టుకుంది. ప్రభాస్ అభిమానులను హర్ట్ చేసింది. సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయని భావించారు. కానీ వారి ఆశలు అడియాశలే అయ్యాయి.
బాలీవుడ్ లో బాగా డబ్బులు వచ్చే ప్రాంతం నైజాం. ఇక్కడే సినిమాకు తగిన ప్రోత్సాహం రాలేదు. నైజాం వసూళ్లు రూ. 50 కోట్లకు మించలేదు. కోసింగ్ లో రూ. 36 కోట్ల మాత్రమే షేర్ చేయడం గమనార్హం. సీడెడ్ లో రూ. 10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10 కోట్లు రాబట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.82 కోట్లు షేర్ చేయడం నిరాశ కలిగించింది. హిందీలో సైతం రూ. 70 కోట్లకు మించలేదంటే అతిశయోక్తి కాదు.
కర్ణాటక, ఓవర్సీస్ సహా ఇండియాలో తక్కువ మొత్తంలోనే కలెక్షన్లు సంపాదించుకుంది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాలేకపోయాయి. దీంతో ప్రభాస్ కు చేదు అనుభవమే ఎదురైంది. బయ్యర్స్ కు రూ. 50 కోట్ల నష్టం వచ్చింది. దీంతో ఆదిపురుష్ సినిమాపై వచ్చిన అంచనాలు అందుకోలేకపోయింది. ఇలా నిరాశపరచడంతో చిత్రం యూనిట్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.
ReplyForward
|