
Symbol tension : తెలంగాణ సీఎం కేఆర్ ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి ప్రవేశించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించి ప్రజల్లోకి వెళ్లాలని తన ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం సూచించారు. అయితే ఎన్నికల ముంగట కేసీఆర్ ఈసీ నుంచి టెన్షన్ మొదలైంది. ఎన్నికల సంఘం తాజాగా పార్టీ గుర్తలను విడుదల చేసింది. BRS కారు గుర్తుకు దగ్గరగా ఉండే అనేక సింబళ్లు ఉన్నాయని BRS నాయకులు ఆరోపిస్తున్నారు.
స్వతంత్ర అభ్యర్థుల కోసం EC 193 కొత్త చిహ్నాలను విడుదల చేసింది. ఇందులో రోడ్ రోలర్, చపాతీ రోలర్, కుట్టు యంత్రం, టెలివిజన్, ఇతర చిహ్నాలు BRS కారు గుర్తుకు దగ్గరగా ఉన్నాయి. ఈ సింబళ్లతో గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్నది. దీంతో BRS పోలింగ్ ను దెబ్బతిసే ప్రమాదం ఉందని ఆ పార్టీ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. జాతీయ రాజకీయాల ప్రణాళికల్లో ఉన్న కేసీఆర్కు తన పార్టీ కారు గుర్తుకు సమానమైన చిహ్నాలను ఈసీ విడుదల చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఈసీ కొత్త గుర్తులను విడుదల చేయడంతో కేసీఆర్ మరింత టెన్షన్ పడుతున్నారు.
అయితే ఇప్పటికే పలు ఎన్నికల్లో ఇలాంటి గర్తులు దెబ్బతీశాయి,. ఇతర రాష్ర్టాల్లో కూడా ఇలా జరిగిన దాఖలాలు ఉన్నాయి. దీంతో ఈ గుర్తులతో తమ అభ్యర్థులకు ఎక్కడ చెక్ పడుతుందోనని భావిస్తున్నారు. ఈసారి తెలంగాణలో గట్టి పోటీ తప్పేలా లేదు. కాంగ్రెస్, బీజేపీ రెండు వైపుల నుంచి ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఈసారి తెలంగాణలో పాగా వేయాలని అన్ని పార్టీలు రాజకీయ చతురతతో అడుగులు వేస్తున్నాయి. మరో వైపు ఇప్పటికే టీఆర్ఎస్ పేరిట మరో పార్టీ రిజిస్ర్టేషన్ చేయించారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా సీఎం కేసీఆర్ కు తలనొప్పిలా మారే అవకాశం ఉంది. ఒకవైపు గుర్తులు, మరోవైపు టీఆర్ఎస్ అనే పార్టీ మరి గులాబీ బాస్ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.