
మెగా స్టార్ చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో తనే ఒక పవర్ సెంటర్ గా మారారు. టాలీవుడ్ సినిమాకు సరికొత్త రికార్డులను పరిచయం చేశారు. మెగాస్టార్ కు మించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఏకకాలంలో సినిమాలు, రాజకీయాల్లో తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు.
టాలీవుడ్ లో మరో స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా తన తరం హీరోల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తండ్రి అక్కినేని నాగేశ్వర్ రావు వారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. కొత్త టెక్నీషియన్లు, డైరెక్టర్లు, హీరోయిన్లను పరిచయం చేయడంలో ముందున్నారు నాగార్జున. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, దశరథ్, తదితర దర్శకులను పరిచడం చేశారు. ఇతర హీరోల సినిమాల్లోనూ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. నిర్మాతగాను కొత్త వారికి అవకాశం కల్పించారు. తన తరంతో ముందు తరం వాళ్లతోనూ, జూనియర్లతోనూ మంచి రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తుంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో అయితే ప్రెండ్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వీరద్దరి మధ్య ఎంతో బాండింగ్ ఉంది. అది ఎన్నో సార్లు కనిపించింది కూడా. అయితే పవన్ కల్యాణ్ చాలా రిజర్వ్ డ్ గా ఉంటారు. రాజకీయాల్లోకి రాకముందు తన సినిమాలు తప్ప బయటకు పెద్దగా వచ్చింది లేదు. సినిమా ఫంక్షన్లలోకు అటెండ్ అయ్యేది కూడా తక్కువే.
బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్ నాగార్జున దగ్గర..

పవన్ కల్యాణ్ కెరియర్ లో తమ్ముడు సినిమా టాలీవుడ్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా టైటిల్ ముందుగా నాగార్జున రిజిస్ర్టేషన్ చేసుకున్నాడు. అయితే పవన్ కల్యాన్ సినిమా కూడా హీరో క్యారెక్టర్ తమ్ముడే. దీంతో ఈ సినిమాకు తమ్ముడు టైటిల్ అయితే బాగుంటుందని దర్శకుడు చెప్పారు. అప్పటికే టైటిల్ నాగార్జు ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించడంతో పవన్ కల్యాన్ నాగార్జునను కలిశారు సినిమా కథను నాగార్జునకు వివరించి టైటిల్ కావాని కోరడంతో వెంటనే ఓకే చెప్పాడు కింగ్. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అవ్వడం సూపర్ హిట్ అవ్వడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున ఇంత త్యాగం చేశాడు అంటూ అప్పట్లో ఒక వార్త ఇండస్ట్రీలో బాగా వినిపించింది.
ReplyForward
|