
Pawan give up : టాలీవుడ్ పరిశ్రమకు సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సీజన్ లో సినిమాలు రిలీజ్ అయితే ప్లాప్ టాక్ వచ్చిన కోట్ల వసూళ్లు అందుకుంటాయి.. అదే హిట్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వస్తాయో కూడా చెప్పడం కష్టమే.. ఎంత పెద్ద హీరో అయిన, డైరెక్టర్ అయిన సంక్రాంతి సీజన్ మీదనే ముందుగా కన్నువేస్తారు.
ఆ సీజన్ కుదరకపోతే అప్పుడు వేరే డేట్ కు ఫిక్స్ అవుతారు. ఇది ఇప్పటి ట్రెండ్ కాదు ఎప్పటి నుండో ఈ సీజన్ లో సినిమాలను విడుదల చేసేందుకు హీరోలు ఇష్టపడుతున్నారు.. అప్పట్లో బాలకృష్ణ సంక్రాంతి సీజన్ అంటే ముందు ఉండేవారు. ఇక ఇప్పుడు ఉన్న హీరోల్లో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటున్నారు.. ఈయన కెరీర్ లో సగానికి పైగానే సినిమాలు సంక్రాంతికే రిలీజ్ అయ్యాయి..
ఇక ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న SSMB28 కూడా వచ్చే ఏడాది 2023 సంక్రాంతికి ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు జనవరి 13న లాక్ చేసి పెట్టుకున్నాడు. ఇక ఈసారి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాల్లో ఏదో ఒకటి రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.. కానీ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాను వాయిదా వేయించినట్టు ఇప్పుడు టాక్ వస్తుంది.
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ప్రాణ స్నేహితులు.. ఆయన కోసం పవన్ ఏమైనా చేస్తారు.. అందుకే త్రివిక్రమ్ రిక్వెస్ట్ చేయడంతో పవన్ వెనక్కి తగ్గినట్టు ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.. సంక్రాంతికి ఎలా లేదన్న 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంటుంది.. ఇలాంటి ఛాన్స్ మరో హీరో వదులుకోడు.. కానీ పవన్ అలాంటి అవకాశాన్ని చేజార్చుకోవడం ఫ్యాన్స్ కు ఎంతమాత్రం ఇష్టం లేదు.. ఇదే ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తుంది.