
vote for BJP : దేశాన్ని ఇది చేస్తాం.. అది చేస్తాం.. అంటూ ప్రగల్బాలు పలికిన మోడీ చేసపై పార్లమెంట్ ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో వ్యతిరేక పోస్టులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రత్యర్థులతో పాటు కొంత మంది వీటిని క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా వదులుతున్నారు. మోడీ హయాంలో రేట్ల పెంపు, డీమానిటైజేషన్, కార్పొరేట్ గద్దల భారీ సంపాదన, ఇలా చాలా అంశాలతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఇటీవల దర్శనం ఇచ్చింది. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యలో ఇలాంటి పోస్ట్ లు బీజేపీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కిన తర్వాత చాలా కష్టాలే పడింది. డీమానిటైజేషన్, తర్వాత కరోనా, ఆ తర్వాత ద్రవ్యోల్బనం వీటన్నింటిని అధిగమించేందుకు ప్రజలపైనే భారం మోపింది మోడీ సర్కార్. ప్రపంచంలో ఆర్థిక పరంగా ఐదో అతిపెద్ద దేశంగా గుర్తింపు సంపాదించినా స్వదేశంలో మాత్రం అపవాదులను మూటగట్టుకుంది. బీజేపీపై ఎవరికి తోచింది వారు చెప్తున్నారు. ఒకరు బీజేపీ పాలనలోనే మంచి జరిగిందని అంటుంటే మరొకరు పేదలను కడుపుకొట్టి కార్పొరేట్ గద్దలకు సంపదను మోడీ పంచుతున్నాడని మండిపడుతున్నారు.
ఏది ఏమైనా ఈ పోస్ట్ లపై నెటిజన్లు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఓటర్లకు ఇది మంచి సందేశం అని కొందరంటే. మరికొందరు మోడీ ప్రభుత్వ వైఫల్యాలు అంటున్నారు. ఇక బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా వీటిపై భిన్నంగా స్పందిస్తున్నారు. మోడీ కేంద్రంలో ఉన్నాడు కాబట్టే ఐదో ఆర్థిక మైన వ్యవస్థగా దేశం ఎదిగిందని అంటున్నారు. కరోనా కష్టాలను ఎదుర్కొనేందుకు ఇలాంటివి తప్పదని.. రీసెంట్ గా కేంద్రంలో భారీగా ఉద్యోగాల భర్తీ చేసింది వీరికి కనిపించలేదా..? అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా మోడీ సర్కార్ ప్రతిష్టను ఇది దిగజార్చేలాగానే ఉన్నాయి.