AP Income : ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందనే వార్తలే కానీ రాబడి పెరిగిందనే వార్తలు వినిపించలేదు. జగన్ సర్కారు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని ప్రసార మాధ్యమాలు హోరెత్తిస్తున్నాయి. కానీ ప్రభుత్వానికి డబ్బు కూడా అదే రేంజ్ లో వచ్చిందనే విషయం చాలా మందికి తెలియదు. దాన్ని ప్రింట్ మీడియా కూడా వక్రీకరించింది కానీ నిజాలు వెల్లడించలేదు.
2019-20లో రూ.1,11,034 కోట్ల ఆదాయం సమకూరింది. 2020-21లో రూ.1,17,136 కోట్ల ఆదాయం వచ్చింది. 2021-22 నాటికి రూ.1,52,554 కోట్ల ఆదాయం సంపాదించుకుంది. 2022-23లో రూ.1,76,448 కోట్లు రాబట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. అడుక్కుతినే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. మరి ఈ ఆదాయం ఎక్కడ నుంచి వచ్చిందని అడుగుతున్నారు.
జగన్ పరిపాలనలోకి వచ్చిన నుంచి నేటి వరకు సుమారు రూ.60 వేల కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజలకు నగదు బదిలీ చేస్తున్నారు. అంతేకానీ ఎవరి దగ్గర యాచించడం లేదు. రాష్ట్రంలో పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి. జగన్ పరిస్థితిని అధ్వానంగా చూపుతున్నాయి. ఏకపక్ష వార్తలు రాస్తూ మోసం చేస్తున్నాయనే వాదనలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మరీ అంత దిగజారి పోలేదు. కాకపోతే అప్పుల భారం పెరిగింది. పరిపాలన కోసం ఖర్చులు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం కదా ధరల పెరుగుదల. దీని కారణంగా రాష్ట్ర ఆదాయం ఇబ్బంది కరంగా మారిన మాట వాస్తవమే. ఏపీని చిన్న చూపు చూసేందుకు మన పత్రికలు కారణాలుగా నిలుస్తున్నాయి.