
Bone strength : ఈ రోజుల్లో ఎముకలు బలంగా ఉండటం లేదు. చిన్న పాటి గాయాలకే విరిగిపోతున్నాయి. దీంతో సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎముకల్లో పటుత్వం తగ్గిపోతోంది. ఫలితంగా చిన్న గాయాలకే విరిగిపోతున్నాయి. దీని వల్ల పలు రకాల నష్టాలు వస్తున్నాయి. ఎముకలు అతుక్కోవడానికి చాలా సమయం తీసుకుంటోంది. ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి.
ఎముకల బలానికి అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి. వాటికి కావాల్సిన ప్రొటీన్లు ఇందులో ఉన్నాయి. అవిసెగింజలను లడ్డులుగా చేసుకుని తిన్నా ఫలితం ఉంటుంది. అవిసె గింజలతో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవిసె గింజలను పాలల్లో కలిపి తినొచ్చు. వీటిని లడ్డులుగాకూడా తినవచ్చని చెబుతున్నారు. అవిసె గింజల్లో అంతటి శక్తి దాగి ఉంది.
పాలు, అవిసె గింజల్లో పోషకాలు బాగుంటాయి. రెండింట్లోనూ కాల్షియం, ప్రొటీన్లు, కార్బోహైడ్రేడ్లు, చక్కెర, కొవ్వు ఉన్నాయి. ఇందులో ఫైబర్, మెగ్నిషియం, పాస్పరస్, జింక్, విటమిన్ బి12, విటమిన్ డి అందుతాయి. దీంతో వీటిని తీసుకోవడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఎముకలకు కాల్షియం బలం చేకూరుస్తుంది.
పాలల్లో అవిసె గింజల పొడిని కలిపి తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలోకి వస్తుంది. చక్కెర స్థాయిలు తగ్గించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. జీర్ణ శక్తికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. అవిసె గింజలను పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల ఇంకా ఎన్నో లాభాలున్నాయి. ఇందులో ఉండే పీచు జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది.