
Curry Leaves Benefits :
మనం తినే ఆకుకూరల్లో కరివేపాకు, మునగాకుల్లో ఎన్నో పోషక విలువలుంటాయి. కరివేపాకులో బీటాకెరోటిన్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదల, కంటి చూపుకు ఎంతో ఉపకరిస్తుంది. వంద గ్రాముల కరివేపాకులో 7500 మైక్రో గ్రాుల బీటాకెరోటిన్ ఉంటుందని తెలుసుకుంటే మంచిది. కరివేపాకులో మంచి వాసన ఉంటుంది. దీంతో మన దేహానికి ఎంతో మేలు చేస్తుంది.
కరివేపాకులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు పచ్చిగా తింటే కష్టంగా ఉన్నా దాని వల్ల చాలా రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కరివేపాకులను ఎండబెట్టి పొడి చేసి వాడుకుంటే చాలా మంచిది. దీని వల్ల చెడు కొవ్వును తగ్గిస్తుంది. ఈ పొడిల ఉండే ప్రాపర్టీస్ తో పాటు చెడు కొవ్వను తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
కరివేపాకు పొడి తీసుకోవడం వల్ల మెదడు, నరాల ఆరోగ్యాన్ని పెంచుతుంది. కరివేపాకు పొడిని వెల్లుల్లి కారంతో పాటు టిఫిన్ లో తీసుకుంటే ఎన్నో లాభాలున్నాయి. కరివేపాకు తింటే జుట్టు పెరుగుతుంది. డయాబెటిస్ తగ్గేందుకు దోహదపడుతుంది. కరివేపాకు పొడి వాడటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. గర్భిణులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఇలా కరివేపాకు పొడి వాడుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కూరల్లో వేసుకునే కరివేపాకుతో కూడా లాభాలు మెండుగా ఉంటాయి. కరివేపాకు వాడుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే కరివేపాకును రోజు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. కరివేపాకు తీసుకుంటే మనకు మేలు జరగడం ఖాయమని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.